Karthika masam: ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలనే నియమం పెద్దలు ఎందుకు పెట్టారంటే..

కార్తీక మాసంలో నదీ స్నానం అని పెద్దలు పెట్టిన నియమానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటారు. మన దేశంలో నైరుతి రుతుపవనాల వలన భారీ వర్షాలు కురుస్తాయి. అంటే ఆశ్వయుజమాసం వరకూ రుతుపవనా వలన వర్షాలు కురుస్తాయి. దీంతో అప్పటి వరకూ వరద నీటితో పోటెత్తిన నదులన్నీ.. కార్తీక మాసం వచ్చే సరికి తమ ఉధృతిని తగ్గించుకుంటాయి.

Karthika masam: ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలనే నియమం పెద్దలు ఎందుకు పెట్టారంటే..
Karthika Masam 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 03, 2024 | 9:26 AM

కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో చేసే నదీ స్నానానికి దీప దానానికి శివ కేశవుల పూజకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. కార్తీక మాసంలోని నెల రోజుల పాటు సూర్యోదయాని కంటే ముందే అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే ప్రవహించే నీటిలో స్నానం చేస్తారు. కార్తీక మాసం సహజంగానే చలి తీవ్రత మొదలయ్యే నెల. దీంతో ఈ చలికాలంలో శరీరం ధృడత్వాన్ని సంతరించుకునే విధంగానే కాదు వాతావరణానికి అనుగుణంగా తనని తాను మలచుకునెందుకు ఈ కార్తీక మాసంలో తెల్లవారు జామునే నదీ స్నానం నియమం పెట్టినట్లు ఉన్నారు పెద్దలు. చలిలో వేడి నీటితో స్నానం చేయవచ్చు.. అయితే చన్నీరుతో స్నానం చేయడం అత్యంత కష్టం.. ముఖ్యంగా నిల్వ ఉన్న నీరు మరింత చల్లగా ఉంటుంది. అదే భూ గర్భం నుంచి వచ్చిన నీరు నులి వెచ్చగా ఉండి స్నానం చేయడం వలన ఉదయం బద్ధకం తీరేలా ఉండడమే కాదు.. శరీరం వెచ్చగా ఉంటుంది. బహుశా అందుకనే మన పెద్దలు ఈ నెలల్లో నదీ స్నానం నియమం పెట్టి ఉంటారు.

నదీ స్నానం ఔషధ గుణాలు

కార్తీక మాసంలో వరద నీరు.. తేటగా మారుతుంది. రాళ్లనీ, వృక్షాలనీ రాసుకుంటూ సాగే నదులు.. ఆయా ఖనిజాలనీ, మూలికలనీ తమలో కలుపుకుని ప్రవహిస్తూ సాగిపోతూ ఉంటాయి. దీంతో నదీజలాలలో ఔషధీగుణాలు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటాయి కనుక .. ఈ నెలలో నదీ స్నానం ఆరోగ్యపరంగా మంచిది అని పెద్దలు నియమం పెట్టి ఉంటారు.

ఇవి కూడా చదవండి

కార్తీక మాసంలో శక్తి వంతంగా చంద్రుడు

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం నీటి మీదా, మానవుల మనసు మీదా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ మాసంలో చంద్రుడు చాలా శక్తిమంతంగా ఉంటాడట. అందుకే ఈ కార్తీక మాసాన్ని ‘కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో ఔషధులతో తడిచిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని ఓ నమ్మకం. నదులను దైవంగా భావించి పూజిస్తారు. దీపాలు నీటిలో విడిచి పెట్టి భక్తిశ్రద్దలతో నీటిని పూజిస్తారు.

ఏ నదిలో లేదా ఇంట్లో స్నానం చేసినా సరే.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి.. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అంటూ నదులను కీర్తిస్తూ మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరిస్తారు.

ఈ కార్తీక మాసంలో తెల్లవారు జామునే నిద్ర లేచి నదుల వద్దకు చేరుకుని స్నానం చేసి సంకల్పం చెప్పుకుని పితృదేవతలను తల్చుకుని దాన ధర్మాలు చేస్తారు. అరటి కాండంలో దీపాలను వెలిగించి, భగవంతుడిని పూజిస్తారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?