AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలానికి మహర్దశ.. ఈ నెల 9న సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన.. సీ ప్లేన్ సర్వీస్ లాంచ్

సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన నేపథ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ఇప్పటికే సిఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నూతనంగా చేపట్టనున్న(సీప్లేన్) నీటి విమానం లాంచ్ లో భాగంగా సీఎం చంద్రబాబు విజయవాడ నుండి నల్గొండ ప్రాంతంలోని ఎస్.ఎల్.బి.సి వద్దకు చేరుకొని అక్కడి నుండి నీటి విమానంలో ప్రయాణించి శ్రీశైలం పాతాళగంగకు వద్ద ల్యాండ్ అవనున్నట్లు జిల్లా అధికారుల ద్వారా సమాచారం తెలుస్తోంది .

శ్రీశైలానికి మహర్దశ.. ఈ నెల 9న సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన.. సీ ప్లేన్ సర్వీస్ లాంచ్
Cm Chandrababu Srisailam Tour
J Y Nagi Reddy
| Edited By: Surya Kala|

Updated on: Nov 03, 2024 | 8:48 AM

Share

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 9న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆ పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ పట్టనుంది. ఈ ప్లేన్ సర్వీస్ కోసం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేశారు.

సీఎం చంద్రబాబు సందర్శించనున్న ప్రాంతాలలోని రోప్ వే, బోట్ తదితర ప్రాంతాలను సంబంధిత అధికారులను ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. పాతాళగంగ చేరుకొని సీప్లేన్ వచ్చే ప్రాంతాన్ని బోట్ లో ప్రయాణించి జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు త్వరగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం మలన్న క్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా శ్రీశైలాన్ని తిరుమల తరహాలో ఆధ్యాత్మికంగాను అటు పర్యాటకంగాను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ (సీప్లేన్) నీటి విమానం పర్యాటకంగా అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసేందుకు ముందడుగుగా చెప్పవచ్చు. ఇప్పటికే సీప్లేన్ ఏర్పాటుకు కృష్ణా నదిపై అనువైన ప్రాంతాల కోసం ఏరోడ్రోమ్ ఎయిర్ పోర్ట్ అధికారులు, నీటిపారుదల, పర్యాటక, అటవీశాఖ అధికారులు కలిసి పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరప్రాంతం అధికంగా ఉన్న నేపథ్యంలో పర్యాటకంగా ఏపీకి ఇది బాగా ఉపయోగపడుతుందని రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టు ఏపీకి వచ్చేలా కృషిచేశారు. సీప్లేన్ అందుబాటులోకి వస్తే పర్యాటకంగా అటు విజయవాడ, ఇటు శ్రీశైలం అభివృద్ధికి ఎంతగానో దోహదం చేయనుంది. పర్యాటకులు ఒక రోజులోనే రెండు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఈ విమానాలు పర్యాటకంగానే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో, ఏవైనా ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఉపయోగపడతాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..