TTD: తిరుమల శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు ఆన్ లైన్లో విడుదల.. వర్చువల్ క్యూ సిస్టమ్‌లో రిలీజ్
శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. రేపటి నుండి అక్టోబర్ 31 వరకు టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో
Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. రేపటి నుండి అక్టోబర్ 31 వరకు టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది తిరుమల తిరుపతి దేవస్థానం. టికెట్ల బుకింగ్ కు విపరీతమైన డిమాండ్ ఉండటంతో వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్ల కేటాయింపు చేశారు. వర్చువల్ క్యూ పద్ధతి వల్ల సర్వర్ల క్రాష్ సమస్య తప్పనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికార్లు భావిస్తున్నారు. వర్చువల్ క్యూ పద్ధతితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు భక్తులు.
ఇదిలాఉంటే, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వచ్చే భక్తులకు పలు నిబంధనలు విధించింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిపికెట్ తప్పనిసరిగా చూపాలని ఆలయ ఈవో జవహార్ రెడ్డి స్పష్టం చేశారు. లేదంటే.. మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ అయినా తీసుకురావాలన్నారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యకార్యదర్శిగా ఈవో జవహార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అయితే, 12 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఈ నిబంధన నుంచి సడలింపు ఇస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలిపారు. ఇక 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారికి దర్శనం తేదీ నుంచి 72 గంటల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు.
18 సంవత్సరాల పైబడిన వారికి రెండు డోసుల వ్యాక్సీన్ వేసుకున్న సర్టిఫికెట్, లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఈవో స్పష్టం చేశారు. అయితే, ఈ నిబంధనలుపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు సడలింపు ఉంటుందని, అక్టోబర్ 1వ తేదీ నుంచి పక్కా అమలు చేయడం జరుగుతుందని ఈవో చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
Read also: Road Accident: కృష్ణాజిల్లా పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి