AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: మరికాసేపట్లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ

మరికాసేపట్లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.

Tirumala: మరికాసేపట్లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ
Venkata Narayana
|

Updated on: Sep 25, 2021 | 9:18 AM

Share

TTD: మరికాసేపట్లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. రోజూ భక్తులకు 8 వేల ఉచిత సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయాలన్న టీటీడీ తాజా నిర్ణయంతో అక్టోబర్ 31 వరకు 36 రోజుల కోటా విడుదల చేయబోతున్నారు. సర్వదర్శనం టోకెన్ ల కోసం తిరుపతిలో ఇంటర్నెట్ సెంటర్ల వద్ద బారులు తీరారు భక్తులు.

ఇదిలాఉంటే, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వచ్చే భక్తులకు పలు నిబంధనలు విధించింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిపికెట్ తప్పనిసరిగా చూపాలని ఆలయ ఈవో జవహార్ రెడ్డి స్పష్టం చేశారు. లేదంటే.. మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ అయినా తీసుకురావాలన్నారు.

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యకార్యదర్శిగా ఈవో జవహార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అయితే, 12 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఈ నిబంధన నుంచి సడలింపు ఇస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలిపారు. ఇక 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారికి దర్శనం తేదీ నుంచి 72 గంటల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు.

18 సంవత్సరాల పైబడిన వారికి రెండు డోసుల వ్యాక్సీన్ వేసుకున్న సర్టిఫికెట్, లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఈవో స్పష్టం చేశారు. అయితే, ఈ నిబంధనలుపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు సడలింపు ఉంటుందని, అక్టోబర్ 1వ తేదీ నుంచి పక్కా అమలు చేయడం జరుగుతుందని ఈవో చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

కాగా, శ్రీవారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌ను ఆహ్వానిస్తామని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.

Read also:  Janasena: జనసేన నాయకుడి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. అసలేం జరిగిందంటే..!