AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: ఆ రోజుల్లో తిరుమలకు రావద్దు.. టీటీడీ కీలక ప్రకటన.. కారణం ఏంటంటే

తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 15 వరకు వరస సెలవులు ఉండటంతో భక్తులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సెలవుల కారణంగా తిరుగిరులకు భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున...

TTD: ఆ రోజుల్లో తిరుమలకు రావద్దు.. టీటీడీ కీలక ప్రకటన.. కారణం ఏంటంటే
TTD
Ganesh Mudavath
|

Updated on: Aug 09, 2022 | 8:03 PM

Share

తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 15 వరకు వరస సెలవులు ఉండటంతో భక్తులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సెలవుల కారణంగా తిరుగిరులకు భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున భక్తులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది. రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని, తిరుమలకు (TTD) వచ్చి ఇబ్బందులు పడవద్దని టీటీడీ ప్రకటించింది. ముందస్తు ప్లాన్ ప్రకారంగా దర్శనం టికెట్లు, రూమ్ బుకింగ్ వంటి సౌకర్యాలను ముందుగానే చేసుకుని రావాలని తెలిపింది. రద్దీ నెలకొనే అవకాశమున్నందున వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 19 వరకు సెలవులు, తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. కాబట్టి ఈ సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి నిర్ణీత వేళల్లోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రావచ్చని టీటీడీ స్పష్టం చేసింది.

మరోవైపు.. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండున్నరేళ్ల తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుమాడ వీధుల్లో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించడంతో పాటు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేస్తూ అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులకు అన్నప్రసాదం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీకి తగ్గట్టు రోజుకు 9 ల‌క్షల లడ్డూలు పంపిణీ కి సర్వం సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..