Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై సమస్త సమాచారం ఒకే యాప్‌లో.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు ఆలయానికి సంబంధించిన పూర్తి సమచారాన్ని తెలుసుకోవడం సాధారణమైన విషయం. రూమ్‌లు, దర్శనం టికెట్లు, దర్శన సమయాల్లో మార్పులు చేర్పులు ఇలా ఎంతో సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు భక్తులు ఈ సమాచారం తెలుసుకోవడానికి..

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై సమస్త సమాచారం ఒకే యాప్‌లో.
TTD to issue Special Tickets for 13th Jan
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 09, 2022 | 7:11 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు ఆలయానికి సంబంధించిన పూర్తి సమచారాన్ని తెలుసుకోవడం సాధారణమైన విషయం. రూమ్‌లు, దర్శనం టికెట్లు, దర్శన సమయాల్లో మార్పులు చేర్పులు ఇలా ఎంతో సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు భక్తులు ఈ సమాచారం తెలుసుకోవడానికి టీడీడీ అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయించే వారు. కానీ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇందుకోసం ఓ యాప్‌ను తీసుకొస్తున్నారు. భక్తుల కోసం సమస్త సమాచారాన్ని అందించే విధంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గోవింద పేరుతో ఓ యాప్‌ అందుబాటులో ఉన్నా. ఇందులో పూర్తి సమాచారం అందుబాటులో లేదు.

ఈ ఉద్దేశంతో టీటీడీ తాజాగా కొత్త యాప్‌ను తీసుకొస్తోంది ఐటీ విభాగం. ఇప్పటికే యాప్‌‌ దాదాపు పూర్తికాగా.. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. టీటీడీ తీసుకొస్తున్న ఈ యాప్‌ ద్వారా పూర్తి సమచారాన్ని పొందొచ్చు. ఇదిలా ఉంటే భక్తులు ప్రస్తుతం దర్శనం, రూమ్‌ బుకింగ్ వంటివి టీటీడీ వెబ్‌సైట్‌లో చేసుకుంటున్నారు. కానీ ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే ఇకపై దర్శనం, గదులు, శ్రీవారిసేవా టికెట్లను యాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు. అలాగే సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు.

అంతేకాకుండా టికెట్లకు సంబంధించిన ఛార్జీలను కూడా చాలా సులభంగా యాప్‌ ద్వారా చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాప్‌తో భక్తులు మరింత సులభంగా శ్రీవారి దర్శనం పొందగలుగుతారని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..
ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?