Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Tirupati: భక్తుల భద్రత కోసం టీటీడీ చర్యలు.. ప్రతి ఒక్కరికి కర్ర.. డ్రోన్లు వాడాలని నిర్ణయం

అలిపిరిలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలను అనుమతిస్తామని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతించమన్నారు. పెద్దలకు రాత్రి పది గంటల వరకే నడకదారిలో అనుమతి ఉంటుందన్నారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల వరకే టూవీలర్స్‌కు అనుమతి ఇస్తామన్నారు. భక్తుల భద్రతకు నైపుణ్యం కలిగిన ఫారెస్ట్ సిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తామన్నారు.

Tirumala Tirupati: భక్తుల భద్రత కోసం టీటీడీ చర్యలు.. ప్రతి ఒక్కరికి కర్ర.. డ్రోన్లు వాడాలని నిర్ణయం
Tirumala Tirupati
Follow us
Surya Kala

|

Updated on: Aug 15, 2023 | 7:32 AM

తిరుమలలో వన్యమృగాల సంచారం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. ఒకటి పట్టుకున్నాం అని చెప్పేలోగా.. నేనున్నా అంటూ మరొక కౄర మృగం సందడి చేస్తోంది. దీంతో టీటీడీ అలర్ట్‌ అయింది. హై లెవల్ మీటింగ్ నిర్వహించి.. భక్తుల భద్రత కోసం మెట్ల మార్గం, ఘాట్‌రోడ్లలో అనేక చర్యలు చేపట్టింది టీటీడీ. తిరుమలలో వన్యప్రాణుల సంచారం.. భక్తుల భద్రతపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో TTD అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. తమకు భక్తుల రక్షణే ముఖ్యమని, ఇందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అలిపిరిలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలను అనుమతిస్తామని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతించమన్నారు. పెద్దలకు రాత్రి పది గంటల వరకే నడకదారిలో అనుమతి ఉంటుందన్నారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల వరకే టూవీలర్స్‌కు అనుమతి ఇస్తామన్నారు. భక్తుల భద్రతకు నైపుణ్యం కలిగిన ఫారెస్ట్ సిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తామన్నారు.

నడకమార్గంలో సాధుజంతువులకు తినడానికి భక్తులు ఏమీ ఇవ్వకూడదని, అలా ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నడక దారిలోని దుకాణాదారులు వ్యర్థపదార్థాలను బయట పారవేస్తే చర్యలు ఉంటాయన్నారు. భక్తుల భద్రత కోసం డ్రోన్లు వాడాలని నిర్ణయించినట్లు చెప్పారు. భద్రతపై భక్తులకూ అవగాహన కల్పిస్తామన్నారు. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాలి నడకన వెళ్లే ప్రతి భక్తుడికి కర్ర ఇస్తామన్నారు.

తిరుపతి – తిరుమల మధ్యలో 500 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. నడక దారిలో బేస్ క్యాంపు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. మెట్ల మార్గంలో ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫెన్సింగ్ ఏర్పాటుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇందుకు టీటీడీ సిద్ధంగా ఉందని, కానీ అటవీశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అటవీశాఖ నిబంధనలు కఠినంగా ఉంటాయని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?