Adhik Maas Amavasya 2023: ఈ ఏడాది అధికమాసం అమావాస్య చాలా విశిష్టమైనది.. ఈ రోజున చేసే అన్నదానికి విశిష్ట స్థానం..

హిందూ విశ్వాసాల ప్రకారం ఏడు తరాల వరకు ఉన్న పూర్వీకులు అధికమాసంలోని అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలకు, తర్పణం, దానాలకు సంతృప్తి పొందుతారు. ఈ ఏడాది ఆగస్టు 16న అధికామాసం అమావాస్య వస్తోంది. ఆగస్టు 16 బుధవారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమావాస్య ప్రాధాన్యత మరింత పెరిగింది.

Adhik Maas Amavasya 2023: ఈ ఏడాది అధికమాసం అమావాస్య చాలా విశిష్టమైనది.. ఈ రోజున చేసే అన్నదానికి విశిష్ట స్థానం..
Adhik Maas Amavasya
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2023 | 3:12 PM

హిందూమతంలో అధికమాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన ఈ మాసంలో వచ్చే అమావాస్యను అధికమాస అమావాస్య అంటారు. మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం వల్ల ఈ కాలంలో వచ్చే అమావాస్య కూడా మూడేళ్లకు ఒకసారి వస్తుంది. అటువంటి పరిస్థితిలో అమావాస్యకు ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ రోజున చేసే స్నానానికి, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది.

హిందూ విశ్వాసాల ప్రకారం ఏడు తరాల వరకు ఉన్న పూర్వీకులు అధికమాసంలోని అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలకు, తర్పణం, దానాలకు సంతృప్తి పొందుతారు. ఈ ఏడాది ఆగస్టు 16న అధికామాసం అమావాస్య వస్తోంది. ఆగస్టు 16 బుధవారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమావాస్య ప్రాధాన్యత మరింత పెరిగింది.

ఆగస్టు 15 ఉదయం 12.42 గంటలకు అధికమాసం అమావాస్య తిథి ప్రారంభమవనుంది. అమావాస్య తిథి ఆగస్టు 16 మధ్యాహ్నం 3.07 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రకారం ఆగస్ట్ 16న అధికమాస అమావాస్య స్నానం చేస్తారు.

ఇవి కూడా చదవండి

మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం అమావాస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇతర నెలవారీ అమావాస్యల కంటే దీని ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక అమావాస్య రోజున చేసే పనులు శుభా అశుభ ఫలితాలను అందిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం..

అధికమాసం అమావాస్య రోజు ఏం చేయాలంటే

  1. బుధవారం అధికమాసం అమావాస్య వస్తోంది. ముందుగా గణేశుడిని పూజించండి. దీని తరువాత శివపార్వతులను పూజించండి. శివలింగానికి అభిషేకం చేయండి. అనంతరం శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని కూడా పూజించండి.
  2. ఈ రోజున, పూర్వీకుల సంతృప్తి కోసం  అన్న దానం చేయాలి. మినుములు, బెల్లం, నెయ్యి సమర్పించి పూర్వీకులను ధ్యానించాలి.
  3. ఆగస్టు 16నుంచి అధికామాసం ముగుస్తోంది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజున విష్ణు పురాణం, శివపురాణం,  రామాయణం వంటి గ్రంథాలను పఠించాలి.
  4. ఈ రోజుల్లో అన్నదానం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అమావాస్య రోజు గుడికి వెళ్లి అన్నదానం చేయవచ్చు.

ఏమి చేయకూడదంటే

  1. అధికమాసంలోని అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రపోకూడదు.
  2. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి నియమ నిబంధనల ప్రకారం పూజలు చేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి.
  3. అమావాస్య రోజు పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఇలా చేయడం లక్ష్మి దేవికి ఆగ్రహం తెప్పిస్తుందని విశ్వాసం.
  4. అమావాస్య సమయంలో మత్తు పదార్థాలు, మాంసాహారం అస్సలు తీసుకోకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)