- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips keep these things at home for money improve financial stability in telugu
Vastu Tips for Money: ఆర్ధిక సంక్షోభంలో ఉన్నారా.. పూజ గదిలో ఈ వస్తువులను ఉంచండి..
హిందూ మతంలో పూజలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పూజలతో మానసిక ప్రశాంతత, కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు సుఖ సంతోషాలను ఇస్తుంది. అయితే ఒకొక్కసారి ఎంత కష్టపడినా ఎన్ని పూజలు చేసినా అప్పులు, ఆర్ధిక సంక్షోభం తో అధిక ఖర్చులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం వాస్తు దోషం వలన కావచ్చు.
Updated on: Aug 14, 2023 | 12:43 PM

వాస్తు దోష నివారణ కోసం కొన్ని చర్యలు అత్యంత ఫలవంతం.. ముఖ్యంగా పూజకు కొన్ని వస్తువులు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాస్తు శాస్త్రం ప్రకారం పూజ సమయంలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపదలు లభిస్తాయి. అలాగే లక్ష్మి అనుగ్రహం సదా ఉంటుందని విశ్వాసం.

పూజ సమయంలో గంట: ఇంట్లో పూజ కోసం ఏర్పాటు చేసే గదికి ప్రత్యేక స్థానం ఉంది. పూజ చేసే సమయంలో గంట మ్రోగించడం వలన ఇంట్లో సానుకూలత ఉంటుందని నమ్మకం. కాబట్టి పూజ సమయంలో గంట మోగిస్తారు.

నెమలి ఈక: శ్రీ కృష్ణుడి అలంకరణలో నెమలి ఈకకు మంచి ప్రాముఖ్యత ఉంది. ఇది కన్నయ్యకు మంచి అందాన్ని ఇస్తుంది. అందుకే కొందరు ఇంట్లో నెమలి ఈకలను ఉంచుతారు. నెమలి ఈక సంపదను పెంచుతుంది. ఇంట్లో శాంతి , ఆనందాన్ని కలిగిస్తుందని విశ్వాసం.

శంఖం : పూజ గదిలో శంఖాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు పూజ అనంతరం.. శంఖాన్నిపూరించడం ద్వారా ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయని నమ్మకం.

కలశం: ప్రతిరోజూ పూజ చేసే సమయంలో నీరు నింపిన కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం అత్యంత ఫలవంతం. ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం దిన చర్యలో భాగంగా చేసుకోండి. కలశం గణేశునికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ కలశం ఉంచబడుతుంది.

గంగా జలం: గంగాజలాన్ని ఇత్తడి లేదా వెండి పాత్రలలో ఉంచుతారు. ఇలా చేయడంతో లక్ష్మీదేవి సంతోషిస్తుందని. ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని విశ్వాసం.




