Tholi Ekadashi: నేడు రైతుల పండగ తొలి ఏకాదశి.. ద్వారకా తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..

| Edited By: Surya Kala

Jul 17, 2024 | 9:35 AM

తొలి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో తలనీలాలు, మొక్కుబడులు సమర్పించి స్వామిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం మంచినీటి సదుపాయంతో పాటు, కంపార్ట్మెంట్లో వేచి ఉండే చంటి బిడ్డల కోసం పాలు బిస్కెట్లు అందుబాటులో ఉంచారు.

Tholi Ekadashi: నేడు రైతుల పండగ తొలి ఏకాదశి.. ద్వారకా తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..
Toli Ekadashi
Follow us on

హిందూ పండుగలలో ఎంతో విశిష్టత ఉన్న పండుగ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాడం మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో తలనీలాలు, మొక్కుబడులు సమర్పించి స్వామిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం మంచినీటి సదుపాయంతో పాటు, కంపార్ట్మెంట్లో వేచి ఉండే చంటి బిడ్డల కోసం పాలు బిస్కెట్లు అందుబాటులో ఉంచారు.

ఏడాదికి 24 ఏకాదశలు ఉంటే అందులో ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశినే మనం తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటాం. తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. క్షీరసాగరంలో శ్రీమహావిష్ణువు తొలి ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించి, నాలుగు నెలల తరువాత క్షీరాబ్ది ద్వాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొంటారని పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో పలువురు ఏకాదశి అంటే 11 అని అర్థం. మనుకున్న ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటన్నింటినీ పనిచేయించే అంతరెంద్రియమైన మనసు కలిసి మొత్తం 11. ఇవన్నీ ఏకోన్ ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై శయనిస్తారు. అందుకే శయన ఏకాదశి అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ ఏకాదశి ప్రకృతిలో జరిగే మార్పులకు సూచికగా చెబుతుంటారు.

ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. ఇది దక్షిణాయనాన్ని సూచిస్తుంది. నేటి నుంచి పలువురు చాతుర్మాష దీక్షను ఆరంభిస్తారు. అదేవిధంగా చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే భూదానం, అశ్వమేదయాగం, 60 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

తొలి ఏకాదశి పండుగను రైతులు ఎక్కువగా జరుపుకుంటారు. ఏరువాక పౌర్ణమి అనంతరం వచ్చే తొలి ఏకాదశి నాడు రైతులు తమ జీవనాధారమైన పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ, అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఆ శ్రీమహావిష్ణువుని తొలి ఏకాదశి నాడు నమస్కారం చేసుకుని మొక్కజొన్న పేలాలను వేయించి, వాటిని మెత్తగా పొడిలా చేసి అందులో బెల్లాన్ని కలుపుకొని దానిని స్వామికి నైవేద్యంగా సమర్పించి అనంతం ప్రసాదంగా స్వీకరిస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..