CM KCR: యాదాద్రికి ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఆలయ నిర్మాణ పనులపై అధికారులకు దిశానిర్దేశం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. చిన్న జీయర్ స్వామితో కలిసి యాదాద్రిలో పర్యటించనున్నారు. అయితే...

CM KCR: యాదాద్రికి ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఆలయ నిర్మాణ పనులపై అధికారులకు దిశానిర్దేశం
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 17, 2021 | 7:59 AM

ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. చిన్న జీయర్ స్వామితో కలిసి యాదాద్రిలో పర్యటించనున్నారు. అయితే, ఈ ఏడాది అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ మాసాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవ‌కాశం ఉందని సమాచారం. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్యట‌న‌కు వెళ్లిన సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆల‌య ప్రారంభోత్సవానికి రావాల‌ని ప్రధాని మోడీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే.. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదిలాఉంటే.. సీఎంఓ ముఖ్య కార్యద‌ర్శి భూపాల్ రెడ్డి ఈ నెల 11వ తేదీన ఆలయ పనులను ప‌రిశీలించిన సంగ‌తి తెలిసిందే. ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగుల పనులను పరిశీలించి పనుల తీరుపై వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు. ప్రసాద విక్రయశాల వద్ద నిర్మించే ర్యాంపు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ దర్వాజలకు ఇత్తడి తొడుగులు బిగింపు ప్రక్రియ తీరును, తొడుగులు తయారీపై స్వర్ణకారులను భూపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి: IIT Admission 2021: ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా IIT లో అడ్మిషన్ తీసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..

PM Modi: సంచలనాత్మక నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధాని నరేంద్ర మోడీ..! గొప్ప నాయకుడిగా ఎలా మారారో తెలుసా?

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు