AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: టీటీడీ గదుల అద్దె పెంపు.. ప్రభుత్వం తీరుని నిరసిస్తున్న ప్రతిపక్షాలు.. వివరణ ఇచ్చిన టీటీడీ

తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చేయాలి అనుకుంటున్నారా?  అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు

Tirumala: టీటీడీ గదుల అద్దె పెంపు.. ప్రభుత్వం తీరుని నిరసిస్తున్న ప్రతిపక్షాలు.. వివరణ ఇచ్చిన టీటీడీ
Tirumala Tirupati
Surya Kala
|

Updated on: Jan 12, 2023 | 11:41 AM

Share

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలోని వసతి గృహాల అద్దెలు భారీగా పెరిగాయి. తిరుమలలో అన్ని పాత వసతి గృహలను ఆధునీకరించాయి. గతంతో పోలిస్తే కొన్ని రకాల వసతి గృహల్లో అద్దెలను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.  ఆధునికీకరణ చేసి.. వసతి గృహల్లో భక్తులకు కొన్ని సౌకర్యాలను కల్పించిన టీటీడీ అద్దె ధరలు భారీగా పెంచి.. భక్తులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఇలా అద్దె గృహాల రెంట్ ని పెంచడంపై బీజేపీ, టీడీపీ నేతల సహా పలువురు అభ్యతరం చెబుతున్నారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చేయాలి అనుకుంటున్నారా?  అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారని టీటీడీ అధికారుల తీరు సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు అద్దెలు 1100 శాతం పెంచడం వెనుక మీ ఉద్దేశ్యం ఏంటి? కలియుగ వైకుంఠం విషయంలో ప్రభుత్వం అహంకారానికి పోవద్దంటూ  వద్దని హితవు చెప్పారు. భక్తుల మనోభావాలు గుర్తించమని చంద్రబాబు సూచించారు.

ఇక మరోవైపు   ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపు మేరకు ఏపీలో అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది.   భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ ఆఫీసు వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. హిందువులు, హిందు ఆలయాలు అంటే ఈ ప్రభుత్వానికి అలుసా  అంటూ విష్ణు వర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా టీటీడీ అధికారులను ప్రశ్నించారు. తిరుమల, తిరుపతి దేవస్ధానం వసతి గదుల అద్దె పెంపు నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు శ్రీశైలం దేవస్ధానం ప్రసాదాల కోసం వాడే వస్తువుల సరఫరా కాంట్రాక్టులో అవినీతిపై విచారణ చేయాలని.. వెంటనే  దేవాదాయ శాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.

మరోవైపు టీటీడీ గదుల అద్దె పెంపు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో టీటీడీ సిబ్బంది వివరణ ఇచ్చింది. ధరల పెంపుతో టీటీడీపై వస్తున్న విమర్శలను ఖండించింది. వసతులకు అనుగుణంగానే గదుల అద్దె పెంచినట్టు టీటీడీ ప్రకటించింది. నారాయణగిరి గెస్ట్ హౌస్ లోని గదులను రూ.150 నుండి రూ.1700 పెంచిన టీటీడీ..స్పెషల్ టైప్ కాటేజీల్లో రూ.750 నుండి రూ.2200 పెంపుకు గల కారణాలను వివరించింది. ఈ గదుల్లో ఏర్పాటు చేసిన వసతులకు అనుగుణంగానే గదుల అద్దె పెంచినట్టు తెలిపింది.  భక్తుల కోరిక మేరకే గదులను ఆధునీకరించి ఏసీ, నూతన ఫర్నిచర్, గీజర్లు ఏర్పాటు చేశామని తెలిపింది. ఇప్పటి వరకు 30 ఏళ్ల ముందు నిర్ణయించిన అద్దెనే వసూలు చేశామని పేర్కొంది.  వసతి గదుల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిగణలోకి తీసుకుని అందుకు తగిన విధంగానే గదుల అద్దెను పెంచమని.. భారీగా పెంచమని ప్రచారం చేయడం తగదని టీటీడీ హితవు పలికింది. అంతేకాదు రూ.50, రూ.100 గదుల ధరలను పెంచలేదని టీటీడీ సిబ్బంది పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..