Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanuma 2023: సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా

సంక్రాంతి పర్వదినాల్లో ఇలా గాలిపటాలు ఎగురవేయాలనే నమ్మకానికి సంబంధం ఉంది. దీని వెనుక మంచి ఆరోగ్య రహస్యం దాగి ఉంది. నిజానికి.. మంకర సంక్రాంతి నాడు సూర్యుని నుండి అందే సూర్యకాంతి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.

Kanuma 2023: సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా
Kite Flying In Kanuma
Follow us
Surya Kala

|

Updated on: Jan 12, 2023 | 9:28 AM

హిందువుల పండగల్లో మకర సంక్రాంతి అతి పెద్ద పండగ. సంక్రాంతిని వివిధ పేర్లతో భిన్న సంప్రదాయాలతో జరుపుకుంటారు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఈ పండుగ తరువాత శీతాకాలం తగ్గుముఖం పడుతుంది. వసంత రుతువు ప్రారంభం. మకర సంక్రాంతి పండుగ ఈ ఏడాది జనవరి 1వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశిని విడిచి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. మకర రాశిలో సంచార కారణంగా ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు.

గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం

సంక్రాంతి, మూడో రోజైన కనుమ పండగ రోజున గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. ప్రజలు తమ ఇంటి పైకప్పులు, మైదానాల్లో రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే సంక్రాంతి పర్వదినాల్లో ఇలా గాలిపటాలు ఎగురవేయాలనే నమ్మకానికి సంబంధం ఉంది. దీని వెనుక మంచి ఆరోగ్య రహస్యం దాగి ఉంది. నిజానికి.. మంకర సంక్రాంతి నాడు సూర్యుని నుండి అందే సూర్యకాంతి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. శాస్త్రీయంగా.. ఈ రోజున సూర్యుని కిరణాలు శరీరానికి అమృతం లాంటివి. అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

ఔషధంగా పనిచేసే సూర్యకిరణాలు

చలికాలంలో దగ్గు, జలుబు, అంటు వ్యాధులు వస్తాయి. మకర సంక్రాంతి రోజున సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించినప్పుడు,.. ఈ సమయంలోని సూర్య కిరణాలు శరీరానికి ఔషధంగా పనిచేస్తాయి. ఈ కారణంగా.. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వల్ల శరీరానికి సూర్యకిరణాలు తగిలేలా చేస్తాయి.

గాలిపటాలను రాముడు ఎగురవేశాడనే నమ్మకం

పురాణాల కథనం ప్రకారం, రాముడు తన సోదరుడైన లక్ష్మణుడు, హనుమంతునితో కలిసి త్రేతాయుగంలో మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేసాడని తెలుస్తోంది. అప్పటి నుంచి మకర సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. ఈ రోజు స్నానం, పూజ, దానధర్మాలు చాలా ముఖ్యమైనవి. జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం ఈ ఏడాది రోహణి నక్షత్రంలో మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు ఫలప్రదంగా భావించే బ్రహ్మయోగం, ఆనందాది యోగాలు ఏర్పడనున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)