కనులపండువగా.. బ్రహ్మాండ నాయకుడి బ్రహోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.

కనులపండువగా.. బ్రహ్మాండ నాయకుడి బ్రహోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
Cm Chandrababu At Tirumala
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 04, 2024 | 8:57 PM

తిరుమల శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్యలో మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరగ్గా ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు వెంకన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 7.55 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం చేరుకున్న చంద్రబాబు, 14వ సారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు గా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో జె. శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంక‌య్య చౌద‌రి స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలను సీఎం కు ఈఓ అందజేశారు. సిఎం వెంట రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
రక్తాన్ని సహజంగా శుద్ధి చేసే ఆహారాలు.. ఆహారంలో తప్పక చేర్చుకోండి
రక్తాన్ని సహజంగా శుద్ధి చేసే ఆహారాలు.. ఆహారంలో తప్పక చేర్చుకోండి
పడి లేచిన కెరటం మంజు వారియర్..
పడి లేచిన కెరటం మంజు వారియర్..
బాలయ్య బాటలో దళపతి.. గెలుపు పక్కాన ??
బాలయ్య బాటలో దళపతి.. గెలుపు పక్కాన ??
మీరు ఆన్‌లైన్‌లో కొన్న ఫోన్‌ ఒరిజినలేనా.? తెలుకోవాల్సిన విషయాలివే
మీరు ఆన్‌లైన్‌లో కొన్న ఫోన్‌ ఒరిజినలేనా.? తెలుకోవాల్సిన విషయాలివే
2024లో బెస్ట్ డైట్ మెడిటేరియన్‌ డైట్‌ అంటే ఏమిటి? ఎన్ని లాభాలంటే
2024లో బెస్ట్ డైట్ మెడిటేరియన్‌ డైట్‌ అంటే ఏమిటి? ఎన్ని లాభాలంటే
అక్రమమైతే నేనే కూలుస్తా.. ఫామ్‌ హౌస్‌లపై కొనసాగుతున్న రాజకీయ రగడ
అక్రమమైతే నేనే కూలుస్తా.. ఫామ్‌ హౌస్‌లపై కొనసాగుతున్న రాజకీయ రగడ
బెల్లం, శనగపప్పు కలిపి తింటే.. శరీరంలో జరిగే అద్భుత మార్పులివే..
బెల్లం, శనగపప్పు కలిపి తింటే.. శరీరంలో జరిగే అద్భుత మార్పులివే..
అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? రోజుకి రెండు సార్లు ఇలా చేయండి
అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? రోజుకి రెండు సార్లు ఇలా చేయండి
గృహ రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా..?ఆ బ్యాంకుల్లో వడ్డీ ఎంతంటే?
గృహ రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా..?ఆ బ్యాంకుల్లో వడ్డీ ఎంతంటే?