Andhra Pradesh: శ్రీశైలం భ్రమరాంబ ముక్కంటి ఆలయానికి 2వ రోజూ పోటెత్తిన భక్తజనం.. దర్శనానికి 10 గంటల సమయం
వరుస సెలవుల నేపధ్యంలో సోమవారం శ్రీశైలం రెండవ రోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రెండవ రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి సుమారు 10 గంటలు సమయం పట్టనుంది. వరుసగా సెలవులు రావడంతో క్షేత్రమంతా భక్తజనం సందోహం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో..
నంద్యాల, డిసెంబర్ 25: వరుస సెలవుల నేపధ్యంలో సోమవారం శ్రీశైలం రెండవ రోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రెండవ రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి సుమారు 10 గంటలు సమయం పట్టనుంది. వరుసగా సెలవులు రావడంతో క్షేత్రమంతా భక్తజనం సందోహం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు10 గంటల సమయం పడుతుంది.
భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. ఇప్పటికే వరుసగా సెలవులు రావడంతో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. రేపటికి క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గే అవకాశం ఉందని ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.