AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pongal Celebrations: ఆ గ్రామంలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్.. స్వామివారికి మగవాళ్లే పొంగళ్ళు పెట్టే.. వింతైన ఆచారం..

Pongal Celebrations: సర్వసాధారణంగా హిందూ సంప్రదాయంలో పూజలకు మహిళలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. దేశంలో కొన్ని దేవాలయాల్లో మాత్రమే వింతైన ఆచారాలు ఉన్నాయి. అరుదుగా మహిళలకు..

Pongal Celebrations: ఆ గ్రామంలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్.. స్వామివారికి మగవాళ్లే పొంగళ్ళు పెట్టే.. వింతైన ఆచారం..
Sri Sanjeevaraya Anjaneya S
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 13, 2022 | 7:09 PM

Share

Pongal Celebrations: సర్వసాధారణంగా హిందూ సంప్రదాయంలో పూజలకు మహిళలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. దేశంలో కొన్ని దేవాలయాల్లో మాత్రమే వింతైన ఆచారాలు ఉన్నాయి. అరుదుగా మహిళలకు ప్రవేశం లేని ఆలయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ దేవాలయంలో పొంగళ్లను సమర్పించే విధానములో వింతైన ఆచారం ఉంది. ఎక్కడయినా దేవుళ్లకు మొక్కులు మొక్కితే ఆడవాళ్లు పొంగళ్లు పెట్టి ఆ మొక్కును తీర్చుకుంటారు. కానీ. ఇదిగో ఇక్కడ మాత్రం వింతగా ఆడవాళ్ళకి బదులు మగవాళ్లే పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. కడప జిల్లాలోని పుల్లంపేట మండలంలో తరతరాల నుంచి ఈ ఆచారం ఆనవాయితీగా వస్తోంది. దీనినే శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగళ్లుగా పిలుస్తారు.

పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో మగవాళ్లు శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగళ్లను ఘనంగా జరుపుకుంటారు.. సంక్రాంతి పండగ కంటే పొంగళ్లు పండగనే ఎంతో ఘనంగా జరుపుకుంటారు..పెద్ద పండగ కి ముందు వచ్చే ఆదివారం ఇలా చేస్తారు. ఇందుకోసం ఈ ఊరు వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే… తప్పకుండా ఆ రోజుకి స్వగ్రామం చేరుకుంటారు..

అయితే, ఇక్కడ మహిళలు మాత్రం ఆలయం లోకి రాకుండా వెలుపల నుంచే స్వామిని దర్శించుకుంటారు. అంతే కాదు స్వామి వారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా మగవాళ్లే తినాలి అన్నది ఆచారం. దానిని ఆడవాళ్లు ఎవరు కనీసం తాకటానికి కూడా వీల్లేదు..అలానే ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఇక్కడ ప్రతిష్టించిన రాతిపై గల శాసనాన్ని వారు దైవంగా భావిస్తారు..దానినే అంతా పూజిస్తారు. ఇలా మహిళలకు ప్రవేశం లేని, ప్రసాదం స్వీకరణకు కూడా అనుమతి లేని ఏకైక ఆలయంగా తిప్పాయపల్లి సంజీవరాయ ఆలయం ప్రసిద్ధిగాంచింది.

Also Read:  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. భవదీయుడు భగత్ సింగ్ సాంగ్స్ రెడీ చేస్తోన్న దేవి..