Saturday Puja: శని దోష నివారణకు వెంకన్న అనుగ్రహం కోసం ఏడు శనివారాలు పూజ అత్యంత ఫలవంతం.. పూజ విధానం మీ కోసం..

|

Jun 24, 2023 | 7:30 AM

కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు.. ఆపద మొక్కుల వాడు అనాధ రక్షకుడు.. తిరుమలేశుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు. శని ప్రభావం నుంచి బయపడడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం..

Saturday Puja: శని దోష నివారణకు వెంకన్న అనుగ్రహం కోసం ఏడు శనివారాలు పూజ అత్యంత ఫలవంతం.. పూజ విధానం మీ కోసం..
Sri Venkateswara Swami Pooja
Follow us on

సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్ట స్థానం ఉంది. వారంలో ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. అంతేకాదు ఒకొక్క గ్రహానికి సంబంధించినదిగా భావించి పూజిస్తారు. ఈ నేపథ్యంలో శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. అంతేకాదు శని దోష నివారణకు.. శనీశ్వరుడికి అనుగ్రహం కోసం శనివారం ప్రత్యేక నివారణ చర్యలను పాటిస్తారు. కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు.. ఆపద మొక్కుల వాడు అనాధ రక్షకుడు.. తిరుమలేశుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు. శని ప్రభావం నుంచి బయపడడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం..

  1. ఎవరి జాతంలో శని దోషం ఉందొ.. జీవితంలో అష్టకష్టాలు పడుతున్నారో.. వారు శ్రీనివాసుని కృపతో  శని దోష నివారణకు ఏడు శనివారాలు పూజ చేయాలి. ఇలా ఏడు శనివారాలు పూజను మహిళలు చేస్తున్న సమయంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే.. ఎన్ని వారలు తర్వాత ఆపారో.. మళ్లీ అక్కడ నుంచి పూజ చేస్తే సరిపోతుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏడు శనివారాలు పూజ విధానం గురించి తెలుసుకుందాం..
  2. శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం అభ్యంగ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి.. అనంతరం పూజా గదిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చేయాలి. ఇందుకు ముందు బియ్యపుపిండి, పాలు ఒక చిన్న బెల్లం ముక్క,  అరటి పండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతి పిండిలా కలిపి.. ఆ పిండితో ప్రమిదను చేసుకోవాలి. అనంతరం ఆ పిండి ప్రమిదలో ఏడు వత్తులను వేసి ఆవు నెయ్యి వేసి.. ఆ దీపాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి  దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి.
  3. శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రీతికరమైన శనివారం నిమనిష్ఠలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. శనివారం వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయని సుఖ సంపదలు కొలువుతాయని విశ్వాసం.
  4. అదే విధంగా శనిదోషంతో బాధలు పడుతున్నవారు శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి.. స్వామివారిని  దర్శించుకుని అనంతరం ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి.. సుఖసంతోషాలు కలుగుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఈ విధంగా ఏడు శనివారాలు వెంకన్నను పూజిస్తే కలియుగ దైవం అనుగ్రహం వలన శని దోషాలు తొలగిపోయి భక్తులు కోరిన కోరికలు, అనుకున్న పనులు జరుగుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).