Sankranti 2024: సంక్రాంతిని మనదేశంలోనే కాదు ఈ దేశాలలో కూడా ఘనంగా జరుపుకుంటారని తెలుసా..!

మకర సంక్రాంతి రోజున చేసి నదీ స్నానం,  దానధర్మాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి గంగానదిలో స్నానాలు చేస్తుంటారు. ఈ మకర సంక్రాంతి పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు. ఈ పండుగ మన దేశంలో వ్యవసాయదారులు సంతోషంగా చేసుకునే పండగ మాత్రమే కాదు.. కొత్త సీజన్ రాకకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మకర సంక్రాంతి పండుగను ఏయే దేశాల్లో జరుపుకుంటారో తెలుసుకుందాం.

Sankranti 2024: సంక్రాంతిని మనదేశంలోనే కాదు ఈ దేశాలలో కూడా ఘనంగా జరుపుకుంటారని తెలుసా..!
Makara Sankranti

Edited By: TV9 Telugu

Updated on: Jan 16, 2024 | 1:17 PM

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటారు. దక్షిణాయణం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 15వ తేదీ జరుపుకోనున్నారు. ఈ పండగను భారతదేశమంతటా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున చేసి నదీ స్నానం,  దానధర్మాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి గంగానదిలో స్నానాలు చేస్తుంటారు.

ఈ మకర సంక్రాంతి పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు. ఈ పండుగ మన దేశంలో వ్యవసాయదారులు సంతోషంగా చేసుకునే పండగ మాత్రమే కాదు.. కొత్త సీజన్ రాకకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మకర సంక్రాంతి పండుగను ఏయే దేశాల్లో జరుపుకుంటారో తెలుసుకుందాం.

శ్రీలంక : శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉంది.  అయితే ఇక్కడ కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను జరుపుకోవడానికి భిన్నమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. శ్రీలంకలో మకర సంక్రాంతిని ఉజాహవర్ తిరనాల్ అంటారు. ఇక్కడ కొందరు దీనిని పొంగల్ అని కూడా అంటారు. దీనికి కారణం ఇక్కడ తమిళనాడుకు చెందిన వారు అధిక సంఖ్యలో నివసించడమే.

ఇవి కూడా చదవండి

మయన్మార్: మయన్మార్‌లో ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక్కడ తినాగ్యాన్ పేరుతో జరుపుకుంటారు. మయన్మార్‌లోని మకర సంక్రాంతి పండుగ బౌద్ధ సమాజంతో ముడిపడి ఉంది. ఈ పండుగ 3 నుండి 4 రోజుల పాటు జరుపుకుంటారు. నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని ఇక్కడ మకర సంక్రాంతిని జరుపుకుంటారని నమ్ముతారు.

థాయిలాండ్ : మకర సంక్రాంతి పండుగను థాయ్‌లాండ్‌లో కూడా జరుపుకుంటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనిని థాయ్‌లాండ్‌లో సాంగ్‌కార్న్ అని పిలుస్తారు. పురాతన కాలంలో థాయ్‌లాండ్‌లోని ప్రతి రాజుకు సొంతంగా ప్రత్యేక గాలిపటం ఉండేది. దేశంలో శ్రేయస్సును కాంక్షిస్తూ సన్యాసులు, పూజారులు ఈ గాలిపటాన్ని చలిలో ఎగురవేసేవారు. థాయ్‌లాండ్ రాజులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా తమ ప్రార్థనలను దేవునికి తెలియజేయడానికి గాలిపటాలు ఎగురవేసేవారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు