Samatha Kumbh 2023: రెండోరోజు వైభవంగా సమతాకుంభ్‌ ఉత్సవాలు.. 108 దివ్యదేశ మూర్తులకు విశేష పూజలు..

ముచ్చింతల్ లోని సమతామూర్తి దివ్యక్షేత్రం లో సమతా కుంభ్ - 2023 మహోత్సవాలు రెండోరోజు ఘనంగా కొనసాగుతున్నాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా

Samatha Kumbh 2023: రెండోరోజు వైభవంగా సమతాకుంభ్‌ ఉత్సవాలు.. 108 దివ్యదేశ మూర్తులకు విశేష పూజలు..
Samatha Kumbh 2023
Follow us

|

Updated on: Feb 03, 2023 | 1:23 PM

ముచ్చింతల్ లోని సమతామూర్తి దివ్యక్షేత్రం లో సమతా కుంభ్ – 2023 మహోత్సవాలు రెండోరోజు ఘనంగా కొనసాగుతున్నాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సమతా కుంభ్ 2023 మొదటి రోజు.. సువర్ణమూర్తి భగవద్రామానుజుల వారికి ఉత్సవారంభస్నపన మహోత్సవంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీ త్రిదండి చినజియర్ స్వామి ఆధ్వర్యంలో.. విశ్వక్సేనుడి ఆరాధన, అనంతరం.. యాగశాల వద్ద అంకురార్పణ కార్యక్రమం జరిపారు.

ఇక రెండోరోజు శుక్రవారం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు సుప్రభాత సేవతో స్వామివారి కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం నాలుగున్నర వరకూ అష్టాక్షరీ మంత్రజపం, ఆరాధన, సేవ, శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్ఠి, నిత్య పూర్ఱాహుతి, బలిహరణ, 108 దివ్యదేశ మూర్తులకు తిరుమంజనసేవ, విశేష ఉత్సవములతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక సాయంత్రం 5 గంటలనుంచి రాత్రి 9 గంటలవ వరకూ సామూహిక శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర పారాయణ, అలాగే 108 దివ్యదేశాలకుచెందిన దేవతా మూర్తులకు గరుడవాహనసేవ, తిరువీధి సేవ, మంగళా శాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించనున్నారు. కాగా, పూర్ణాహుతి కార్యక్రమంలో మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.

సమతా కుంభ్ మహోత్సవాలు లైవ్ మీకోసం..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..