Sabarimala: ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం.. మకర సంక్రాంతి వేళ అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్ టికెట్లు..

Sabarimala: మకర సంక్రాంతి వేళ అయ్యప్ప స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు శబరిమలకు తరలివెళ్తారు. అయితే ప్రస్తుతం..

Sabarimala: ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం.. మకర సంక్రాంతి వేళ అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్ టికెట్లు..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 11:29 AM

Sabarimala: మకర సంక్రాంతి వేళ అయ్యప్ప స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు శబరిమలకు తరలివెళ్తారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మునుపటిలా లేనందున ట్రావెన్ కోర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తుల తాకిడిని తగ్గించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా శబరిమలలో మకరవిలక్కు పండుగ(మకరజ్యోతి) సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌ సదుపాయాన్ని కల్పించింది.

ఈనెల 19వ తేదీ వరకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచింది. బుధవారం సాయంత్రం నుంచి ఈ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు రోజుకు 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్న విషయం తెలిసిందే. మకర సంక్రాంతి పండుగ రోజున కూడా అయ్యప్పను దర్శించుకునేందుకు 5వేల మంది భక్తులకే అవకాశం కల్పించింది. ఈ పరిమితిలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రావెన్‌ కోర్ బోర్డు స్పష్టం చేశారు.

Also read:

Pawan Harish Film: పవన్-హరీష్ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్.. ఇంతకుముందెప్పుడూ చేయని పాత్రలో

Adipurush Shooting: సెట్స్‌పైకి వెళుతోన్న ప్రభాస్‌ కొత్త సినిమా.. భారీ హంగులతో తీర్చిదిద్దిన సెట్‌లో..