కృష్ణమ్మ ఒడ్డున, సీతమ్మ పాదాల చెంత: ఆలయాల నిర్మాణానికి రేపు భూమిపూజ, ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు శ్రీకారం
విజయవాడ కృష్ణా నది ఒడ్డున, సీతమ్మ పాదాల చెంత.. తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రేపు భూమిపూజ చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

విజయవాడ కృష్ణా నది ఒడ్డున, సీతమ్మ పాదాల చెంత.. తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రేపు భూమిపూజ చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రూ. 70 కోట్లతో ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీపీ బత్తిన శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ పర్యవేక్షించారు.
ఇక, విజయవాడలో పునఃనిర్మాణం చేపట్టే ఆలయాల వివరాలు ఇలా ఉన్నాయి: 1. రూ.70 లక్షలతో రాహు–కేతు ఆలయం 2. రూ.9.50 లక్షలతో శ్రీసీతమ్మ పాదాలు 3. రూ.31.50 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో) 4. రూ. 2 కోట్లతో రాతితో శ్రీశనీశ్వర ఆలయం పునఃనిర్మాణం 5. రూ. 8 లక్షలతో బొడ్డు బొమ్మ.. 6. రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద) 7. రూ. 10 లక్షలతో శ్రీసీతారామ లక్ష్మణ సమేత శ్రీదాసాంజనేయ ఆలయం 8 రూ. 10 లక్షలతో వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్ రూం సమీపంలో) 9. కనకదుర్గ నగర్‌లో రూ.20 లక్షలతో శ్రీవేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల.
దుర్గ గుడి అభివృద్ది విస్తరణ పనుల వివరాలు: 1. రూ.8.50 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం 2. రూ. 5.60 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునః నిర్మాణం 3. రూ. 2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ 4.రూ. 23.60 కోట్లతో కేశఖండన శాల భవన నిర్మాణం 5.రూ. 19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం 6. రూ. 5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా (తిరుపతి అలిపిరి వద్ద ఉండే ద్వారం మాదిరిగా దుర్గ గుడి ఘాట్ ఆరంభం వద్ద నిర్మిస్తారు) 7. రూ. 6.5 కోట్లతో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడకుండా మరమ్మత్తులు, పట్టిష్ట చర్యలు. 8. రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పనులు



