Raghava Lawrence: మరోసారి రాఘవేంద్రస్వామి మీద భక్తిని చాటుకున్న నటుడు .. దేశంలోనే అతిపెద్ద విగ్రహం తయారీ
Raghava Lawrence: ప్రముఖ దర్శకుడు, నటుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి.. కారు క్లినర్ నుంచి..
Raghava Lawrence: ప్రముఖ దర్శకుడు, నటుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి.. కారు క్లినర్ నుంచి ఈరోజు దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. గ్రూప్ డ్యాన్సర్ గా చేస్తున్న లారెన్స్ లోని ప్రతిభను గుర్తించి చిరంజీవి తన సినిమాకు కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇస్తే.. లారెన్స్ లోని ప్రతిభను గుర్తించి మొదట డాన్సర్స్ యూనియన్ లో చేరటానికి సహాయం చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్.. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. తనదైన శైలి నటుడుగా, దర్శకుడుగా , డ్యాన్స్ మాస్టర్ గా రాణించాడు. అయితే లారెన్స్ రాఘవేంద్ర స్వామీకి పరమ భక్తుడు అన్న సంగతి తెలిసిందే.. దీనికి కారణం.. ఆరోగ్యంతో బాధపడుతున్న లారెన్స్ బతికి బట్టకట్టడానికి ఈరోజు ఈ స్టేజ్ కు చేరుకోవడానికి రాఘవేంద్ర స్వామేనని బలంగా విశ్వసిస్తాడు.
అందుకనే తన పేరుని రాఘవ లారెన్స్ గా మార్చుకున్నట్లు పలు సందర్భాల్లో చెప్పాడు. మంచి దైవ భక్తిగల లారెన్స్ రాఘవేంద్ర స్వామి బృందావనం ఆలయాన్ని ఆవడి-అంబత్తూర్ మార్గంలో ఉన్న తిరుమల్లైవయల్ లో నిర్మించాడు. ఈ ఆలయం 2010, జనవరి 1 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే లారెన్స్ మరోసారి రాఘవేంద్ర స్వామి మీద తనకు ఉన్న అచంచలమైన భక్తిని తెలియజేశాడు.
దేశంలోనే అతి ఎత్తైన రాఘవేంద్ర స్వామి విగ్రహాన్ని లారెన్స్ రెడీ చేయించారు. ఈ విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు లారెన్స్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 15 అడుగులు ఉన్న స్వామి విగ్రహం ముందు భక్తితో లారెన్స్ కూర్చుకున్న ఫోటోని షేర్ చేశాడు. మార్బుల్ రాయితో అందంగా సజీవంగా స్వామివారు కూర్చుని ఉన్నారా అన్నట్లు ఉంది ఈ విగ్రహం. ఈ విగ్రహాన్ని అతి త్వరలోనే ప్రతిష్టించి.. ప్రజలు పూజలు చేసేందుకు అనుమతి ఇస్తామని లారెన్స్ చెప్పాడు. స్వామివారి మీద ఎంత భక్తి విశ్వాసం ఉందో .. తన అమ్మపైన కూడా లారెన్స్ అంతే ప్రేమని చూపిస్తారు. తన అమ్మ విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్టించిన సంగతి తెలిసిందే.
Sri Raghavendra Swamy’s biggest statue in India!! pic.twitter.com/Q5DzW2Gd35
— Raghava Lawrence (@offl_Lawrence) October 28, 2021