Durga Mantras: దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మవారిని ఈ 32 నామాలతో పూజించండి.. అద్భుత ఫలితాలు పొందండి..
Powerful Durga Mantras: హిందువులు పూజించే అమ్మవారిలో దుర్గాదేవి ప్రముఖ స్థానం పొందింది. భారతీయ దేవతల్లో అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మవారు దుర్గాదేవి. దుష్ట శిక్షణ చేసి.. తన భక్తులను దుర్గాదేవి..
Powerful Durga Mantras: హిందువులు పూజించే అమ్మవారిలో దుర్గాదేవి ప్రముఖ స్థానం పొందింది. భారతీయ దైవత్వాలలో అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మవారు దుర్గాదేవి. దుష్ట శిక్షణ చేసి.. తన భక్తులను దుర్గాదేవి దర్శిస్తుందని భక్తుల నమ్మకం. చెడుపై మంచి చేసే యుద్దానికి ప్రతీకగా భావిస్తారు. అందుకనే ఎవరైనా శత్రువుల వలన పీడింపబడుతుంన్నా.. భయం కలుగుతున్నాయి, కష్టాల్లో ఉన్నవారు.. దుర్గమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఇక కష్టనష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే దుర్గాదేవిని 32 నామాలతో .. స్తోత్రం చేస్తే పడిపోతున్న వారికి చేయందించి అమ్మవారు పైకి లాగుతుంది.. అంతటి శక్తికల 32 నామాలు ఏమిటో చూడండి..
దుర్గాదేవి-ద్వాత్రింశన్నామావాళి
దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ.. ఇవి దుర్గాదేవి 32 నామాలు.
32 నామాలకు అర్ధం:
1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం. 2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకి వందనం. 3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ నీకు వందనం. 4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం. 5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం. 6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం. 7.దుర్గతోద్దారిణీ: దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ నీకు వందనం. 8.దుర్గనిహంత్రీ: మనదెగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ నీకు వందనం. 9.దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ నీకు వందనం. 10.దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ నీకు వందనం. 11.దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ నీకు వందనం. 12.దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ నీకు వందనం(తేలికగా దర్శనం ఇవ్వని తల్లి). 13.దుర్గమాలోక: చర్మచక్షువులు,పంచేంద్రియాలతో చూడలేని తల్లీ నీకు వందనం. 14.దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం. అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపంమని అర్ధం 15.దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి త్రోవచూపేతల్లీ నీకు వందనం. 16.దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ నీకు వందనం(శ్రీవిధ్యా స్వరూపం). 17.దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ నాకు వందనం (శ్రీచక్రం). 18.దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానానికి తల్లీ నీకు వందనం. 19.దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లీ నీకు వందనం. 20.దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ నీకు వందనం. 21.దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ నీకు వందనం. 22.దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని.. రెండోది దుర్గమమైన అర్ధాలుగల తల్లీ నీకు వందనం. 23.దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ నీకు వందనం. 24.దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ నీకు వందనం. 25.దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ నీకు వందనం. 26.దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ నీకు వందనం. 27.దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ నీకు వందనం. 28.దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ నీకు వందనం. 29.దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ నీకు వందనం. 30.దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ నీకు వందనం. 31.దుర్గభా: ప్రకాశం గల తల్లీ నీకు వందనం. 32.దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ నీకు వందనం.
ఓం నమో దుర్గాయ నమః అంటూ ఈ 32నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం.. భక్తుల నమ్మకం..
Also Read: Tirumala Accident: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తుల కారుకి యాక్సిడెంట్.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..
Prabhas: తన లుక్‌పై దృష్టిపెట్టి సరికొత్తగా కనిపించనున్న ప్రభాస్.. సీక్రెట్‌గా చికిత్స కోసం యూకేకి పయనం?…