AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Masam 2022: ఘనంగా జరుగుతున్న కన్వర్ యాత్ర..నేడు ధ్వజారోహణం కన్వరియాలపై పూల వర్షం కురిసేలా ఏర్పాట్లు

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని మాస శివరాత్రి రోజున నాలుగు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. దీనిని కన్వర్ మేళా అంటారు.  ఈ మేళాలో లక్షలాది భక్తులు హరిద్వార్ నుండి గంగాజలాన్ని తీసుకురావడానికి వెళ్లారు. ఆ గంగాజలంతో మహాదేవుని జలాభిషేకం చేస్తారు.

Shravana Masam 2022: ఘనంగా జరుగుతున్న కన్వర్ యాత్ర..నేడు ధ్వజారోహణం కన్వరియాలపై పూల వర్షం కురిసేలా ఏర్పాట్లు
Parsurameswara Pura Mahadet
Surya Kala
|

Updated on: Jul 26, 2022 | 10:37 AM

Share

Pura Mahadev Mandir: శ్రావణ మాసంలో ప్రతి రోజు పవిత్రమైనది. అయితే ఈ మాసంలో వచ్చే సోమవారం, ప్రదోష వ్రతం, మాస శివరాత్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఈ మాసంలో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు సమీపంలో ఉన్న  పరశురామేశ్వర పురమహాదేవ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని మాస శివరాత్రి రోజున నాలుగు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. దీనిని కన్వర్ మేళా అంటారు.  ఈ మేళాలో లక్షలాది భక్తులు హరిద్వార్ నుండి గంగాజలాన్ని తీసుకురావడానికి వెళ్లారు. ఆ గంగాజలంతో మహాదేవుని జలాభిషేకం చేస్తారు. ఈ కన్వర్ యాత్ర చేపట్టిన సమయంలో భక్తులు పాదరక్షలు లేకుండా నడుస్తారు. మహాదేవుని పూజ కోసం ఈ కన్వరియాలు తమ బాధను లెక్కచేయరు. పాదరక్షలు లేకుండా ప్రయాణిస్తున్నప్పుడు తమ పాదాలపై బొబ్బల గురించి, వర్షాలు ఇలా వీటిని భక్తులు లెక్కచేయరు. పురమహాదేవుని దర్శనం అనంతరం జలాభిషేకం చేయాలనే తపనతో యాత్రను పూర్తి చేస్తారు. ఈరోజు ఈ  పురమహాదేవ ఆలయ వైభవాన్ని గురించి తెలుసుకుందాం.

పరశురాముడు స్థాపించిన శివలింగం  ఈ దేవాలయం బాగ్‌పత్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి 25 కి.మీ దూరంలోని పురా గ్రామంలో హిండన్ నది ఒడ్డున నిర్మించబడింది. జమదగ్ని మహర్షి తన భార్య రేణుకతో కలిసి ఈ ప్రదేశంలో నివసించేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశంలో పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుక తల నరికి చంపాడని చెబుతారు.  అనంతరం తన పాప పరిహారం కోసం పరశురాముడు ఇక్కడ ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించాడు. శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. పరశురాముని భక్తికి సంతోషించిన శివుడు .. ప్రత్యక్షమై పరశురాముడు తల్లిని బ్రతికించాడు. అంతేకాదు.. పరమశివుడు పరశురాముడికి గొడ్డలిని కానుకగా ఇచ్చాడు. ఈ గొడ్డలితో పరశురాముడు 21 సార్లు క్షత్రియులను వధించాడు. పుర అనే ప్రదేశంలో పరశురాముడు  శివలింగాన్ని స్థాపించడం వల్ల ఈ ఆలయాన్ని పరశురామేశ్వర పురా మహాదేవ ఆలయం అని పిలుస్తారు.

ఆలయాన్ని నిర్మించిన రాణి  కాలక్రమేణా ఆ ప్రదేశం శిథిలావస్థకు చేరుకుంది. శివలింగం కూడా మట్టిలో కూరుకుపోయింది. ఒకసారి లండోరా రాణి వన విహారానికి  బయలుదేరినప్పుడు.. ఏనుగు ఆ ప్రదేశంలో ఆగిందని చెబుతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏనుగు ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేదు. దీంతో రాణి చాలా ఆశ్చర్యపోయి.. ఏనుగు ఆగిన స్థలాన్ని తవ్వమని ఆదేశించింది. అక్కడ మట్టిదిబ్బను తవ్వుతుండగా అక్కడ శివలింగం కనిపించింది. దీంతో రాణి అక్కడ  శివయ్య కోసం ఆలయాన్ని నిర్మించింది.

ఇవి కూడా చదవండి

కన్వర్ జాతర  నేటికీ ఈ ఆలయం భక్తుల ప్రత్యేక విశ్వాసానికి కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం ఉత్తరాది వాసులు శ్రావణ మాస శివరాత్రి రోజున ఇక్కడ నాలుగు రోజుల కన్వర్ జాతరను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కన్వర్ మేళా జూలై 25  సోమవారం నుండి ప్రారంభమైంది.. ఈ జాతర 28 వరకు కొనసాగుతుంది. ఈ జాతర కోసం ప్రభుత్వ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా తర్వాత తొలిసారిగా బాగ్‌పత్‌లోని పురా మందిర్‌లో జాతర జరుగుతోంది. దీంతో ఈ ఏడాది 30 లక్షల మంది కన్వరియాలు ఆలయానికి వచ్చి జలాభిషేకం చేస్తారని అంచనా వేస్తున్నారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని కన్వరియాలపై అధికారులు హెలికాప్టర్‌లో పూలవర్షం కురిపించడానికి ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం ఏటీఎస్ కమాండోలను కూడా ఆలయంలో మోహరించారు. అంతే కాకుండా డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఆలయంలో కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని చెబుతారు. పరశురామేశ్వర పురా మహాదేవ ఆలయ ప్రధాన పూజారి పండిట్ జై భగవాన్ మాట్లాడుతూ.. జలాభిషేకం చేయడానికి కన్వరియాలు, భక్తులు ప్రతిరోజూ ఆలయానికి చేరుకుంటారని చెప్పారు. ఈ ఏడాది కన్వరియాలు, భక్తుల సంఖ్య రికార్డ్ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఈరోజు సాయంత్రం 06:48 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాలపై ఆధారంగా ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అందించబడింది.)