నేటి నుంచి దేశ వ్యాప్తంగా శక్తిని అమ్మవారి రూపంలో కొలిచే నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు కనక దుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు వైభవంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వారి అలంకారాల్లో మార్పులు చేశారు. దీంతో నవరాత్రులు తొమ్మిది రోజుల్లో పది అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రుల్లో మొదటి రోజు కనక దుర్గాదేవి వాస్తవంగా స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చేవారు.. అయితే ఇప్పుడు ఆ స్దానంలో శ్రీ మహాచండి అలంకారం రూపంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.
అంతేకాదు దసరా రోజున దుర్గాదేవి రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసరా రోజు ఉదయం శ్రీమహిషాసురమర్దినిగా.. మధ్యాహ్నం నుండి శ్రీరాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రుల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ చదువుల తల్లి సరస్వతి దేవిగా కనిపించనుంది. ఈ ఏడాది నవరాత్రుల్లో 20 వ తేదీ మూలా నక్షత్రం వచ్చింది. ఈ రోజున అమ్మవారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఓ వైపు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.. మరో వైపు ఇంద్రకీలాద్రి కొండపై రాళ్లు విరిగి పడుతున్నాయి. దీంతో ఆలయాధికారులు అప్రమత్తమై భక్తుల క్యూ లైన్స్ లో మార్పులు చేశారు. నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారి దర్శనం కోసం తెల్లవారు జామున 4 గంటల నుండే ఇంద్రకీలాద్రికి భక్తులు క్యూ కట్టారు.
అయితే దుర్గాదేవి దర్శనం భక్తులకు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతాయని పోలీసులు క్యూ లైన్ లో ఉన్న భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. అయితే తమకు ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నామని.. ఆన్లైన్ లో రూ. 1000 టికెట్లను జారీ చేశారు.. ఇప్పుడు దర్శనం .. 8 గంటల తర్వాత అని చెప్పడంపై భక్తులు ఆలయాధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. అయితే ఈ రోజు అమ్మవారికి శ్నపనాభిషేకం నిర్వహించిన అనతరం 9 గంటలకు భక్తులకు దర్శనాలు ప్రారంభమకానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..