Vastu Tips: మంచం కింద ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థిక సమస్యలు తప్పవు సుమా..

మంచం కింద ఉండే ఖాళీ స్థలాన్ని ఎవరూ ఖాళీగా వదిలేయరనే విషయం తెలిసిందే. ఆ కాసింత స్థలాన్ని ఎందుకలా వదిలేయడం అని ఏదో ఒక వస్తువును పెడుతుంటారు. అయితే ఖాళీగా ఉంది కదా అని ఏ వస్తువు పడితే అది పెడితే మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. మంచం కింద కొన్ని రకాల వస్తువులను పెడితే ఆర్థికంగా నష్టపోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ...

Vastu Tips: మంచం కింద ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థిక సమస్యలు తప్పవు సుమా..
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 14, 2023 | 10:54 PM

ఇంట్లో ప్రతీ వస్తువును వాస్తు ప్రకారంగానే పెట్టాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు. పొరపాటున కూడా కొన్ని చోట్ల కొన్ని రకాల వస్తువులను ఉంచితే ఏమాత్రం మంచికాదని సూచిస్తున్నారు. ఇంట్లో మనం ఉంచే వస్తువుల పొజిషన్‌ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇక మంచం కింద ఉండే ఖాళీ స్థలాన్ని ఎవరూ ఖాళీగా వదిలేయరనే విషయం తెలిసిందే. ఆ కాసింత స్థలాన్ని ఎందుకలా వదిలేయడం అని ఏదో ఒక వస్తువును పెడుతుంటారు. అయితే ఖాళీగా ఉంది కదా అని ఏ వస్తువు పడితే అది పెడితే మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. మంచం కింద కొన్ని రకాల వస్తువులను పెడితే ఆర్థికంగా నష్టపోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ మంచం కింద ఎలాంటి వస్తువులు ఉంచకూడదు.? వీటివల్ల జరిగే నష్టాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* మంచం కింద కొందరు పాత పెట్టెలను పెడుతుంటారు. అయితే ఈ పెట్టెల్లో ఎట్టి పరిస్థితుల్లో దేవుని విగ్రహాలు లేదా దేవుడి ఫొటోలు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే చనిపోయిన పెద్దల ఫొటోలు కూడా మంచం కింద ఉండే పెట్టేల్లో పెట్టకూడదని సూచిస్తున్నారు. పొరపాటున పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

* మంచం కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడని మరో వస్తువు ఆహారం. మంచం కింద ఆహారానికి సంబంధించిన వస్తువులను పెడితే మనసులో చెడు ఆలోచనలు కలుగుతాయి. అంతేకాకుండా మంచంపై పడుకునే వారి ఆలోచనలు కూడా తప్పు దారి పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇకపై పొరపాటున కూడా మంచం కింద ఆహారాన్ని పెట్టకండి.

* మంచం కింద ఉండే పెట్టేల్లో బంగారం, వెండి ఆభరణాలను మనలో చాలా మంది పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

* ఉపయోగించడం లేదు కదా అని కొందరు వంట సామాగ్రాని కూడా మంచం కింద పెడుతుంటారు. అయితే ఇలా చేయడం కూడా మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశంతో పాటు, ఆర్థికి పరిస్థితి దిగజారే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* మంచం కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడని వస్తువుల్లో డబ్బు కూడా ఒకటి. సెక్యూరిటీ కోసం చాలా మంది మంచం కింద డబ్బును పెడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?