
రావణుడు గొప్ప విద్యావంతుడు. చాలా జ్ఞానవంతుడు. అయితే అంతే గర్విష్ఠుడు. అతని అహంకారం వల్లే మరణించాడు. తన కొడుకు పుట్టిన సమయంలో రావణుడు నవ గ్రహాలను బంధించాడు. రావణుడి భార్య మండోదరి రాక్షస శిల్పి మాయాసురుడి కుమార్తె. మండోదరి శివ భక్తురాలు. అందమైన యువతి. తెలివైనది. దీంతో రావణుడు ఆమెను తన భార్యగా ఎంచుకున్నాడు. ఈ కారణంగానే రావణుడు మండోదరిని వివాహం చేసుకున్నాడు. తన కుమారుడు శక్తివంతుడు, తెలివైనవాడు కావాలని అతను కోరుకున్నాడు.
కొడుకు జన్మించే సమయానికి గ్రహాలను బంధించిన రావణుడు
రావణుడు చాలా బలశాలి. చాలా జ్ఞానవంతుడు. రాక్షసుడైన రావణుడు ఇంద్ర సింహాసనాన్ని సాధించాలని కలలు కన్నాడు. అందుకోసం అతను చాలా ప్రయత్నాలు చేసాడు. అయితే విజయం సాధించలేకపోయాడు. అపుడు రావణుడు తన కొడుకు ద్వారా తన అసంపూర్ణమైన కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. అందుకే తన కొడుకు జన్మించినప్పుడు.. అన్ని గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉండాలని కోరుకున్నాడు. మండోదరికి ప్రసవ నొప్పులు ప్రారంభమైన సమయంలో నవ గ్రహాలు సరైన స్థానంలో లేవు. దీంతో రావణుడు తన కొడుకు జతకం సరిగ్గా ఉండాలని.. తొమ్మిది గ్రహాలను బంధించాడు. తన కోరిక ప్రకారం వాటిని జాతకంలో సరైన స్థానంలో ఉండాలని కోరాడు. మేఘనాథుడి జాతకంలో నవ గ్రహాలు శుభప్రదమైన, ఖచ్చితమైన స్థితిలో ఉండాలని అతను కోరుకున్నాడు.
రావణుడి మాట వినని శనీశ్వరుడు
రావణుడిని బంధించడం వల్ల నవ గ్రహల్లోని శనీశ్వరుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలు ఆయన మాట విన్నాయి. అయితే చివరి క్షణంలో శనీశ్వరుడు తన గ్రహ స్థితిని మార్చుకున్నాడు. ఇది చూసిన రావణుడు కోపోద్రిక్తుడై శనీశ్వరుడిని తన కాళ్ళ కింద తొక్కి పెట్టి నలిపివేశాడు. అంతేకాదు రావణుడు శనీశ్వరుడితో నువ్వు నా కాళ్ళ కింద ఉన్నప్పుడు నా కొడుకు మీద నీ చెడు దృష్టి ఎలా వేయగలవని అహంకారం ప్రదర్శించాడు. అయితే అప్పటికే శనీశ్వరుడు నేరుగా రావణుడిని చూడడంతో ఆయన చెడు దృష్టి రావణుడి మీద పడింది. అప్పుడే రావణుడి పతనం.. లంకకు చెడు సమయంమొదలైంది. రావణుడి మరణం రాముడి చేతిలోనే నిర్ణయించబడింది. ఈ సంఘటన తర్వాత రావణుడు శనీశ్వరుడిని లంకలో బంధించాడు. అంతేకాదు శనిశ్వరుడి కాలుపై దాడి చేశాడు. ఈ కారణంగా శనీశ్వరుడు కుంటుతూ నడుస్తుంటాడు. మిగిలిన గ్రహాలు రావణుడి మాట వినడంతో రావణుడి చేర నుంచి విడుదలయ్యాయి.
శని దేవుడిని బంధనం విడిపించిన హనుమంతుడు
తరువాత హనుమంతుడు సీతాదేవిని వెతుక్కుంటూ లంకకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడి చూసి బంధనం నుండి విడిపించాడు. అప్పుడు శనీశ్వరుడు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు.. ఇక నుంచి నిన్ను పూజించే వారెవరిపై తాను ఎలాంటి ప్రభావం చూపను… తన చెడు దృష్టి అతనిపై పడదని చెప్పాడు. అందుకే శనీశ్వర ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి హనుమంతుడిని పూజిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.