ఈరోజు సంకటహర చతుర్ధశి.. ఈరోజున గణపతిని ఎందుకు పూజిస్తారు.. ప్రాముఖ్యత …
Sankashti Chaturthi 2021: హిందూ క్యాలెండర్ ప్రకారం చతుర్ధి తేదీ ప్రతి నెల రెండుసార్లు వస్తుంది. మొదటి చతుర్ధి శుక్ల పక్షంలో వస్తుంది.
Sankashti Chaturthi 2021: హిందూ క్యాలెండర్ ప్రకారం చతుర్ధి తేదీ ప్రతి నెల రెండుసార్లు వస్తుంది. మొదటి చతుర్ధి శుక్ల పక్షంలో వస్తుంది. అలాగే రెండవది కృష్ణ పక్షంలో వస్తుంది. ఈరోజున గణేశుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. ఈరోజు భల్ చంద్ర సంకాష్ట చతుర్ధి. ఈరోజున వినాయకుడిని పూజించడం వలన కోరిన కోర్కేలు తీరుతాయని నమ్మకం.
శుభ సమయం..
భల్ చంద్ర సంకటహర చతుర్ధశి.. మార్చి 31.. ఉదయం 11 గంటల నుంచి ఏప్రిల్ 1 ఉదయం 6 గంటల వరకు ఉంటుంది.
ప్రాముఖ్యత..
హిందూ పంచాంగం ప్రకారం సంకటహర చతుర్థి రోజున భక్తులు గణేశుడిని ఆరాధిస్తుంటారు. ఈరోజున సంకష్తి చతుర్థిని అని కూడా అంటారు. ఈరోజున వినాయక వ్రతం చేయడం వలన ఘన బాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఇక హిందూ సంప్రదాయంలో మొదటి పూజ అందుకునేది వినాయకుడే. ఏదైనా పని మొదలు పెట్టే ముందు గణేశుడిని పూజించడం మన సంస్కృతి. భారతీయ ఋషులు సమాజాన్ని సంఘాన్ని లోతుగా పరిశీలించి జీవన విధానంలో అధ్యాత్మ ప్రాతిపదికలుగా కొన్ని ఆచారాలను నిర్దేశించారు. అందులో ప్రతి పూజలోనూ ప్రారంభంలో విఘ్నేశ్వరుడిపూజ చేయడంవల్ల ఘన బాధలు తొలగుతాయని ఎందరో దేవతలు ఉన్నా ఆది పూజ్యుడు గా వినాయకుని పూజించడం గురించి తెలిపింది.
సంకటహర చతుర్ధశి ఆరాధన పద్ధతి..
ఈరోజున ఎర్రటి దుస్తువులు ధరించడం మంచిందని చెబుతుంటారు. ఏమి తినకుండా ఉపవాసం ఉండి.. సాయంకాలం చంద్రుడిని చూసిన తర్వాత భోజనం చేస్తారు. వినాయకుడిని పూజించడం రాత్రి నెలవంక చూడటం ఈ రోజు విశేషాలు. వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపం దీపం నైవేద్యాలు అందిస్తారు. మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు. శక్తి కొలదీ విగ్రహంలో గాని లేదా పటములో కానీ వినాయకుడిని పూజించవచ్చు. జిల్లేడు గణపతి దీనినే అర్క గణపతి అని కూడా పిలుస్తారు. ఈ మూర్తిని పూజించినా కోరుకున్న కోరికలు తీరుతాయి.
ఈ పొరపాట్లు చేయకండి..
గణేశుడిని ఆరాధించే సమయంలో తులసి ఆకులను వాడకూడదు. మాంసం, మద్యం తీసుకోకుడదు. ఇంట్లో చెడు మాటలు మాట్లాడకూడదు.
Also Read:
Horoscope Today: ఈరాశుల వారికి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి… ఈరోజు రాశిఫలాలు..
Holi Bhai Dooj 2021: హోలీ భాయ్ దూజ్ ప్రాముఖ్యత.. పురాణాల్లో ఉన్న స్టోరీ ఎంటో తెలుసా..