సంక్రాంతి నాడు ఏ రాశివారు ఏం దానం చేయాలో తెలుసా? ఇలా చేస్తే అదృష్టం మీవెంటే

మకర సంక్రాంతి పండగ రోజున గంగా సహా పవిత్ర నదుల్లో స్నానం చేసి, ప్రత్యేక వంటకాలు ఆస్వాదిస్తారు. పతంగులు ఎగురవేస్తూ సంబరాలు జరుపుకుంటారు. ఈ రోజు దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఆయా రాశులవారు తమ రాశికి అనుగుణంగా దానాలు చేయడం ద్వారా సూర్యుడి అనుగ్రహం పొందుతూ, అనేక శుభఫలితాలు సాధిస్తారని నమ్ముతారు.

సంక్రాంతి నాడు ఏ రాశివారు ఏం దానం చేయాలో తెలుసా? ఇలా చేస్తే అదృష్టం మీవెంటే
Sankranti Danam

Updated on: Jan 08, 2026 | 6:27 PM

హిందూ మతంలో సంక్రాంతి అత్యంత ముఖ్యమైన పండగ. ఈ పండగకు ఎంతో పవిత్రత ఉంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో సంక్రాంతిని జరుకుంటారు. సంక్రాంతి పండగ సూర్యుని సంచారానికి సంబంధించినది. మాఘ మాసంలో సూర్యుడు తన కుమారుడు శని దేవుడి రాశి అయిన మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

మకర సంక్రాంతినాడు ప్రజలు గంగా నది, ఇతర పవిత్ర నదులలో స్నానం ఆచరిస్తారు. ఈ రోజున ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తింటారు. పతంగులను ఎగురవేస్తారు. ఈరోజు దానధర్మాలు కూడా చేస్తారు. ఈరోజున దానం చేయడమనేది పురాతన కాలం నుంచి వస్తోంది. ఈ రోజు ఆయా రాశులవారు తమకు సంబంధించిన దానాలు చేసి సూర్యుడి అనుగ్రహం పొందుతారు. దీంతో వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

మకర సంక్రాంతి

2026, జనవరి 14న సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, కాబట్టి మకర సంక్రాంతి జనవరి 14న జరుపుకుంటారు. మకర సంక్రాంతి శుభ సమయం మధ్యాహ్నం 3:13 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:45 వరకు ఉంటుంది, మొత్తం 2 గంటల 32 నిమిషాలు. ఈ రోజు మహా పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:58 వరకు ఉంటుంది, ఇది మొత్తం 1 గంట 45 నిమిషాలు ఉంటుంది.

సంక్రాంతి నాడు ఏ రాశివారు ఏం దానం చేయాలంటే?

మేష రాశి వారు బెల్లం దానం చేయాలి.

వృషభ రాశి వారు బియ్యం దానం చేయాలి.

మిథున రాశి వారు పెసర పప్పు కిచిడి దానం చేయాలి.

కర్కాటక రాశి వారు బియ్యం, చక్కెర మిఠాయి, నువ్వులు దానం చేయాలి.

సింహ రాశి వారు నువ్వులు, బెల్లం, గోధుమలు, బంగారం దానం చేయవచ్చు.

కన్యా రాశి వారు పెసర పప్పు కిచిడి దానం చేయాలి.

తుల రాశి వారు తెల్లని బట్టలు, చక్కెర, దుప్పట్లు దానం చేయాలి.

వృశ్చిక రాశి వారు నువ్వులు, బెల్లం దానం చేయాలి.

ధనుస్సు రాశి వారు కుంకుమపువ్వు దానం చేయాలి.

మకర రాశి వారు నూనె మరియు నువ్వులను దానం చేయాలి.

కుంభ రాశి వారు పేదలకు ఆహారాన్ని దానం చేయాలి.

మీన రాశి వారు పట్టు వస్త్రం, నువ్వులు, పప్పులు, బియ్యం దానం చేయాలి. ఇలా రాశివారు ఆయా దానాలు చేయడం ద్వారా సూర్యుడి అనుగ్రహంతో అదృష్టాన్ని పొందుతారు. వారి జీవితాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. వారికున్న ప్రతికూలతలు తగ్గిపోతాయి.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.