
సూర్యుడు ఉత్తరం వైపు కదులుతున్నప్పుడు ఉత్సవాల సీజన్ ప్రారంభమవుతుంది. ఇది జనవరి 14 లేదా 15న జరుపుకునే పవిత్రమైన మకర సంక్రాంతితో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి జరుపుకుంటారు. కానీ, వివిధ పేర్లు, పద్ధతులతో ఈ పండుగ చేసుకుంటారు. మకర సంక్రాంతి పండుగ అంటే చీకటి నుండి వెలుగులోకి, చలి నుండి శక్తికి మారే సమయాన్ని సూచిస్తుంది.
సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పర్వదినం ఇది. సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతిలో వచ్చే మార్పులకు ప్రతీక. భారతీయ సంప్రదాయంలో ఇది చాలా శుభప్రదమైన కాలం. కొత్త పంట చేతికి వస్తుంది. రైతులంతా ఆనందంగా ఉంటారు. ఇంటి నిండా ధాన్యం రాశులు నిండి వుంటాయి. అందుకే, నువ్వులు, బెల్లం కలిపి ఎక్కువగా తీపి వంటకాలు, ఇంటి ముందు రంగవల్లులు, గోబ్భిళ్లు, చిన్నారులకు పోసే భోగీ పళ్లు, కొత్త అల్లులు, ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల గాలిపటాల వరకు మకర సంక్రాంతి అన్ని విధాలుగా ఆనందాన్ని తెస్తుంది.
సంక్రాంతి మూడు రోజుల పండుగ. బోగీ, మకర సంక్రాంతి, కనుమ. ఈ మూడు రోజుల సంక్రాంతి పండుగల సందడి మామూలుగా ఉండదు. జనవరి 13 (మంగళవారం): భోగి పండుగ. జనవరి 14 బుధవారం మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఇక జనవరి 15న గురువారం కనుమ పండుగ. పంచాంగం ప్రకారం జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 5:45 వరకు ఉంటుంది. (వ్యవధి: 2 గంటల 32 నిమిషాలు) ఇకపోతే, మకర సంక్రాంతి మహా పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:58 వరకు ఉంటుంది. పవిత్ర స్నానాలు, సూర్యుడికి అర్పణలు, దానధర్మాలు, శ్రద్ధా ఆచారాలు, ఉపవాసం ముగించడం ఈ సమయంలో మాత్రమే చేయాలని పండితులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..