Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivaratri 2022: శివారాధనలో ఈ వస్తువులకు నిషేధం.. సమర్పిస్తే.. శివయ్యకు కోపమేనట..అవేంటంటే

Maha Shivratri 2022: దేవతలకు దేవుడు శివయ్య (Lord Shiva).. మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజలను చేస్తారు. శివరాత్రి రోజున ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులు క్యూ కడతారు..

Shivaratri 2022:  శివారాధనలో ఈ వస్తువులకు నిషేధం.. సమర్పిస్తే.. శివయ్యకు కోపమేనట..అవేంటంటే
Maha Shivratri 2022
Follow us
Surya Kala

|

Updated on: Feb 27, 2022 | 7:51 PM

Maha Shivratri 2022: దేవతలకు దేవుడు శివయ్య (Lord Shiva).. మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజలను చేస్తారు. శివరాత్రి రోజున ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులు క్యూ కడతారు. మహాశివరాత్రి పండగ లింగోద్భవం రోజుగా కొందరు.. శివపార్వతుల వివాహం జరిగిన రోజు అని మరికొందరి నమ్మకం. ఈ రోజు జంగమయ్య అనుగ్రహం పొందడానికి భక్తులు అనేక విధాలుగా పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది మహా శివరాత్రి ( మహా శివరాత్రి 2022 ) పండుగ మార్చి 1, మంగళవారం రోజున వచ్చింది.  ఈ సందర్భంగా, మీరు కూడా మహాదేవునికి ప్రత్యేక పూజలను నిర్వహించాలనుకుంటున్నారా… అయితే భోళాశంకరుడికి పూజ చేసే సమయంలో ఈ వస్తువులను సమర్పించవద్దు.. అవి శివయ్యకు ఆగ్రహం తెప్పిస్తాయి. భక్తవశంకరుడి అనుగ్రహం నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. అవి ఎంతో తెలుసా..

  1. శంఖం: తెలిసి, తెలియక మహాదేవుని పూజలో శంఖాన్ని ఉపయోగించవద్దు. మహాదేవుని పూజలో శంఖం ఊదకూడదు. ఎందుకంటే శివుడు శంఖచూడుడు అనే రాక్షసుడు చంపాడని నమ్ముతారు. అప్పటి నుండి, శంఖం ఆ అసురుని చిహ్నంగా పరిగణించబడుతుంది. శంఖచూర్ణుడు నారాయణుని భక్తుడు కనుక..  నారాయణుని ఆరాధనలో శంఖం ఖచ్చితంగా వాయిస్తారు. అయితే మహాదేవుని ఆరాధనలో శంఖం ఉపయోగం నిషేధించబడింది.
  2. మొగలి పువ్వు: శివయ్య పూజకు ఎప్పుడూ ఏ సందర్భంలోనూ మొగలి పువ్వుని సమర్పించకూడదు. తన పూజకు మొగలి పువ్వు అర్హత లేదని శివుడు శపించాడు. కనుక మొగలి పువ్వుని శివుడి పూజకు ఉపయోగిస్తే.. ఆగ్రహం కలుగుతుందని నమ్మకం. అంతేకాదు ఎరుపు రంగు పూలను కూడా మహాదేవునికి సమర్పించకూడదు.
  3. తులసి దళం: తులసి గత జన్మలో బృందా. ఆమె భర్త పేరు జలంధర్. జలంధరుడు శివునిచే చంపబడ్డాడు. కనుక తన భర్తను చంపిన శివయ్య ఆరాధనకు తనను ఉపయోగించడం తులసి నిరాకరించింది.  అప్పటి నుండి నేటి వరకు శివుడి పూజలో తులసిని ఉపయోగించరు.
  4. కొబ్బరి నీరు: మహాదేవునికి కొబ్బరికాయను నైవేద్యంగా పెడతారు. అయితే కొబ్బరినీళ్ళను ఆయనకు ఎప్పుడూ సమర్పించరు.
  5. పసుపు , కుంకుమ: మహాదేవుని పూజలో పసుపు, కుంకుమ కూడా ఉపయోగించరు. శివుడు తన నుదిటిపై తెల్లటి భస్మం ధరిస్తాడు. అయితే కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగు ఉద్దీపనకు కారణంగా పరిగణించబడుతుంది. శివయ్యను పురాణాల్లో విధ్వంసకుడు అని పిలుస్తారు.కనుక శివయ్య పూజలో కుంకుమను ఉపయోగించడం నిషేధించబడింది.

Also Read:

 మహాశివరాత్రికి వైభవంగా కోటప్పకొండ తిరుణాళ్ళు.. కొలువుదీరనున్న ప్రభలు