Maha Kumbha Mela 2025: మహా కుంభమేళాలో ప్రవేశం దక్కాలంటే నాగ సన్యాసుల సరికొత్త కండిషన్..
ప్రయాగరాజ్ లోని మహాకుంభ మేళాలో సనాతనయేతరుల ప్రవేశంపై వివాదం నెలకొంది. నాగ సన్యాసులు కుంభమేళాలో భక్తుల ప్రవేశానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. దీని ప్రకారం మహా కుంభ మేళా జాతర సందర్భంగా గంగా నదిలో స్నానమచారించాలంటే నుదుటిపై తిలకం, మణికట్టుకి పవిత్రమైనదారం తప్పనిసరి చేశారు.
ప్రయాగ్‌రాజ్ లోని మహా కుంభమేళా మరోసారి వార్తల్లో నిలిచింది. కొత్త సంవత్సరంలో జరగనున్న మహా కుంభమేళా లో సనాతనయేతరుల ప్రవేశాన్ని అఖారా పరిషత్ నిషేధించిన తరువాత, ఇప్పుడు నాగ సన్యాసులు కూడా కొత్త మార్గదర్శకాలను వెల్లడించారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మహా కుంభమేళాలో పాల్గొనే వారు నుదుటిపై తిలకం, మణికట్టుపై కాలవ తప్పనిసరి అని.. సందర్శకుల మహా కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించడానికి ఇవి ఉన్నవారికి మాత్రమే అనుమతించబడతారని స్పష్టం చేసింది.
హిందూ మతాన్ని భ్రష్టు పట్టించే ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు జునా అఖారాకు చెందిన నాగ సన్యాసి శంకర్ భారతి తెలిపారు. మత స్వచ్ఛతను కాపాడేందుకే ఈ మార్గదర్శకాన్ని అమలు చేశామని చెప్పారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు మోహరింపు
అఖారాస్‌లోని అన్ని ప్రవేశాల వద్ద పోలీసులను మోహరింప జేస్తామని.. తాము చేసిన మార్గదర్శకాలను పాటించేలా చూస్తామని నాగ సన్యాసులు చెప్పారు. ఎవరైనా దోషులుగా తేలితే శిక్ష అనుభవించాల్సిందే నని చెప్పారు.
జునా అఖారాకు చెందిన మహిళా సన్యాసి దివ్య గిరి ఈ మార్గదర్శకానికి మద్దతు ఇస్తూ మహిళా సన్యాసుల అఖారాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. అఖారా వెలుపల ఒక మహిళా సాధువును ఉంచుతామని వారు వారి నుదిటిపై తిలకం పెట్టుకున్న తర్వాత మాత్రమే లోపలికి అనుమతించనున్నామని చెప్పారు.
సనాతన ధర్మం కోసం తీసుకున్న చర్యలు
భారతీయ సంస్కృతి త్రివేణీ సంగం పవిత్రతను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు నాగ సన్యాసులు స్పష్టం చేశారు. నాగ సన్యాసిలు తమ అఖారాలు దీనితో సంబంధం ఉన్న సాధువులు మొత్తం జాతర ప్రాంతాన్ని గమనిస్తారని చెప్పారు. సనాతనేతరులు ఎవరైనా మన సంస్కృతితో ఆటలాడినా లేదా జాతర ప్రాంతంలోకి ప్రవేశించినా వారిని పట్టుకుని కఠిన శిక్షలు వేస్తామని స్పష్టం చేశారు.
ఈ సమస్యపై తామే చర్యలు తీసుకోగలమని నాగ సన్యాసులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా సనాతనేతరులు మహాకుంభంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు అఖారా పరిషత్ ప్రకటించింది. ఇప్పుడు నాగ సన్యాసులు.. అఖారా పరిషత్ ప్రకటనకు మద్దతిచ్చి దాన్ని అమలు చేసే దిశగా గట్టి అడుగులు వేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..