
చంద్ర గ్రహణం అదివారం రాత్రి 9:58 నిమిషాలకు ప్రారంభం అయ్యి కనీసం 3 గంటల 28 నిమిషాల పాటు ప్రభావం చూపనుంది. ఎన్నడు లేనివిధంగా ఎనభై రెండు నిమిషాల ఈ చంద్రహ్రహణం ప్రక్రియ కొనసాగనుంది. ఈ క్రమంలోనే గ్రహణం అంటేనే ఒక రకమైనా ప్రచారం…విశ్వాసం ఉంది. గ్రహణం రోజు ప్రసవం జరిగితే జన్మించే శిశువులు అనారోగ్యంతో పుడుతారనే ప్రచారం ఉంది .దీనితో గ్రహణం ఏర్పడే రోజు గర్భీణి స్ర్తీలను బయటికి రానివ్వరు. అంతేకాకుండా నెలలు నిండి అసుపత్రులలో ఉన్నప్పటికి గ్రహణం సందర్భంగా సిజేరియన్ వద్దంటూ డాక్టర్లని కోరుతున్నారు. ఇప్పటికే చాలా గైనిక్ అసుపత్రులు బోసిపోయి ఉన్నాయి.
ఎమర్జెన్సీ పేషేంట్స్ మినహా మిగితా పెషెంట్స్ ఎవ్వరూ కూడ గైనిక్ అసుపత్రులకి రావడం లేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉన్నా గ్రహణం పడే సమయంలో రాత్రిపుట సిజేరియన్ చేయవద్దంటూ డాక్టర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనితో డాక్టర్లు ఏమి చేయలేక పేషెంట్ చెప్పిన సమయానికి సిజేరియన్ చేస్తున్నారు. అదే విధంగా ప్రసవం అయినా మహీళలు కూడ గ్రహణం రోజు ఆసుపత్రుల నుంచి డిచ్ఛార్జ్ కావడం లేదు. ఇప్పుడు దాదాపు అన్ని అసుపత్రులలో చంద్రగ్రహణం రోజు ప్రసవాలు గణనీయంగా తగ్గిపోయాయి. నార్మల్ డెలివరీ లు మినహా మిగితా సిజేరియన్ లు అన్ని కూడా వాయిదా వేస్తున్నారు. చంద్ర గ్రహణం ఎఫెక్ట్ ప్రసవాలపైనా స్పష్టంగా కనబడుతుంది.
చంద్రగ్రహణం అంటేనే భయంగా ఉందని గ్రహణం రోజు సిజేరియన్ చెయబద్దని గర్భీణిలు అంటున్నారు. ఆదివారం రోజు గ్రహణం ఉన్న కారణంగా సోమవారానికి వాయిదా వెయ్యాలని డాక్టర్లని కోరినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ చాలామంది గ్రహణం రోజు డెలివరీ చేయవద్దని కోరుతున్నారని గైనకాలజిస్ట్ చెబుతున్నారు. ఎమర్జెన్సీ ఉంటే గ్రహణం తో సంబంధం లేకుండానే సిజేరియన్ చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే పేషెంట్ లు విశ్వాసాన్ని బలంగా నమ్ముతున్నారని డాక్టర్ అంటు న్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..