Lunar Eclipse: చంద్రగ్రహణం సమయంలో ఈ మంత్రాన్ని పఠించండి.. కష్టాలు తొలగి, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి
హిందూ మతంలో చంద్ర గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణ కాలంలో అనేక మతపరమైన ఆచారాలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ఒకటి మంత్రాలను పఠించడం. హిందువుల నమ్మకం ప్రకారం గ్రహణం సమయంలో పూజ చేయడం నిషేధించబడింది. అయితే గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపిస్తారు. మానసికంగా కొన్ని మంత్రాలను జపించడం వలన విశేష ఫలితాలు ఉంటాయి.
చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం. ఈ సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదవచ్చి.. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు.. చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. హిందూ మతంలో చంద్ర గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణ కాలంలో అనేక మతపరమైన ఆచారాలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ఒకటి మంత్రాలను పఠించడం. హిందువుల నమ్మకం ప్రకారం గ్రహణం సమయంలో పూజ చేయడం నిషేధించబడింది. అయితే గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపిస్తారు. మానసికంగా కొన్ని మంత్రాలను జపించడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. మానసిక జపంలో మంత్రాలు మనస్సులో జపిస్తారు. ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం 18వ తేదీ సెప్టెంబర్ 2024 బుధవారం ఏర్పడనుంది.
చంద్రగ్రహణం సమయంలో మంత్రం ఎందుకు జపించాలంటే
చంద్రగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. మంత్రాన్ని పఠించడం ద్వారా.. ఈ ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది. సానుకూల శక్తి ప్రసారం చేయబడుతుంది. మంత్రాలను పఠించడం ద్వారా ప్రతికూల శక్తి నుండి రక్షించడానికి.. సానుకూల శక్తిని పెంచడానికి ప్రయత్నం చేయబడుతుంది.
చంద్రగ్రహణం సమయంలో ఏ మంత్రాన్ని జపించాలి?
ఓం నమః శివాయ:
ఇది చాలా సులభమైన, ప్రభావవంతమైన మంత్రాలలో ఒకటి. అన్ని రాశుల వారు చంద్ర గ్రహణ సమయంలో మానసికంగా ఈ మంత్రాన్ని జపించవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి