Viral Video: సెల్ ఫోన్ చార్జింగ్ కోసం క్యూ కడుతోన్న తుఫాన్ బాధితులు వీరు.. నగదు రహిత సమాజంలో మరో కోణానికి సజీవ దర్పణం

ఈ సూపర్ టైఫూన్ తర్వాత చైనాలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. చైనా ప్రజలు తమ ఫోనలకు చార్జింగ్ పెట్టుకోవాలని కోరుకున్నారు. ఎందుకంటే డబ్బు మొత్తం మొబైల్ ఫోన్‌లోనే ఉంది. మొబైల్ ఫోన్ లేకుండా, మీరు బ్రెడ్ ముక్క కూడా కొనలేరు. అంటూ ఓ వీడియో షేర్ చేశారు. ఇప్పుడు చైనాలో చాలా మార్కెట్లు నగదు రహితంగా ఉన్నాయి. దీంతో ప్రజలు సరుకులు కొనేందుకు ఫోన్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

Viral Video: సెల్ ఫోన్ చార్జింగ్ కోసం క్యూ కడుతోన్న తుఫాన్ బాధితులు వీరు.. నగదు రహిత సమాజంలో మరో కోణానికి సజీవ దర్పణం
Cashless Society ExposeImage Credit source: Social Media
Follow us
Surya Kala

|

Updated on: Sep 12, 2024 | 7:36 AM

సూపర్ టైఫూన్ ‘యాగీ’ చైనాలో భారీ విధ్వంసం సృష్టించింది. ఆసియాలోని అనేక దేశాల్లో భారీ వృక్షాలను, ఇళ్లను కూల్చివేసింది. ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే యాగీ ఎంత ప్రమాదకరంగా ఉందో ఊహించవచ్చు. మరో వైపు ఈ యాగీ తుఫాను చైనా అభివృద్ధికి చెందిన వాస్తవాలను కూడా బహిర్గతం చేసింది. యాగీ సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తుఫాను తర్వాత చాలా నష్టం చిత్రాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఈరోజుల్లో జనాల్లో చర్చనీయాంశమైంది.

ఈ వీడియోలలో చాలా మంది వ్యక్తులు తుఫాను తర్వాత చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను సేకరిస్తున్నట్లు కనిపించారు. అదే సమయంలో ప్రకృతి ముందు సాంకేతికత పరిమితులను చూపించే వీడియో బయటపడింది. నగదు రహిత సమాజం కావడంతో తుపాను ధాటికి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వీడియోలో చూడవచ్చు. మొబైల్‌ ఛార్జింగ్‌ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక చిన్న దుకాణం చుట్టూ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి.. తమ ఫోన్‌లు ఛార్జింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సూపర్ టైఫూన్ యాగీ కారణంగా చైనా ప్రజలకు సమయానికి కరెంటు అందడం లేదని.. మార్కెట్ పూర్తిగా స్తంభించిపోయిందని ఈ వీడియోలో చూపించారు. ఇప్పుడు చైనాలో చాలా మార్కెట్లు నగదు రహితంగా ఉన్నాయి. దీంతో ప్రజలు సరుకులు కొనేందుకు ఫోన్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

ఇక్కడ వీడియో చూడండి

ఈ సూపర్ టైఫూన్ తర్వాత చైనాలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. చైనా ప్రజలు తమ ఫోనలకు చార్జింగ్ పెట్టుకోవాలని కోరుకున్నారు. ఎందుకంటే డబ్బు మొత్తం మొబైల్ ఫోన్‌లోనే ఉంది. మొబైల్ ఫోన్ లేకుండా, మీరు బ్రెడ్ ముక్క కూడా కొనలేరు. అంటూ ఓ వీడియో షేర్ చేశారు.

నగదు రహిత సమాజంలోని ప్రతికూల కోణం ఇది. ప్రజలు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలన్నా ప్రస్తుతం ఫోన్‌లపై ఆధారపడుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితిల్లో చైనీస్ ప్రజలు తమ ఫోన్లను ఛార్జ్ చేయడానికి ఎంత తహతహలాడుతున్నారో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన త‌ర్వాత ప్రజలు రకరకాల కామెంట్స్ చేస్తూ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
అదానీపై కేసుతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం..
అదానీపై కేసుతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం..
'పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది'.. గుజరాత్‌ సీఎం
'పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది'.. గుజరాత్‌ సీఎం
విమానంలో సిగరెట్‌ తాగాడు.. ఆ తర్వాత ??
విమానంలో సిగరెట్‌ తాగాడు.. ఆ తర్వాత ??