మీ ఇంట్లోని ఈ ప్రదేశంలో ఏనుగు విగ్రహాన్ని ఉంచితే సంపద, శ్రేయస్సు, అదృష్టం అన్నీ కలిసి వస్తాయి..!
చాలాసార్లు ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితం దక్కదు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండవు. కొంతమంది ఎప్పుడూ సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఒక కారణం వాస్తు దోషం కావచ్చు అంటున్నారు వాస్తు నిపుణులు. దానిని తొలగించడం ద్వారా జీవితంలో పురోగతి, విజయం, ఆనందం పొందవచ్చు అంటున్నారు. ఇందుకోసం ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఏనుగు విగ్రహం మానసిక బలాన్ని, కుటుంబ ఐక్యతను పెంపొందిస్తుంది. అంతేకాదు.. మీ ఇంట్లోని ఈ ప్రదేశంలో ఏనుగు విగ్రహాన్ని ఉంచితే సంపద, శ్రేయస్సు, అదృష్టం అన్నీ కలిసి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

హిందూ మతంలో ఏనుగును గణేశుడి రూపంగా భావిస్తారు. కాబట్టి, ఏనుగును శుభం, స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఏనుగును పూజించడం ద్వారా గణేశుడి ఆశీస్సులు అందుతాయని నమ్ముతారు. ఫెంగ్ షుయ్‌లో కూడా ఏనుగు విగ్రహాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఏనుగు విగ్రహం లేదా ఫోటో ఉంచుకోవడం ఆనందం, శ్రేయస్సును తెస్తుందని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏనుగుల జంట విగ్రహాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రవేశాన్ని ఆపివేసి ఇంటిని సురక్షితంగా ఉంచుతుందని అంటున్నారు.. అలాగే, ఏనుగు విగ్రహం మానసిక బలాన్ని, కుటుంబ ఐక్యతను పెంపొందిస్తుంది. అయితే, ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని వాస్తు నియమాల ప్రకారం ఎక్కడ ఉంచాలి..?
భారతీయ సంస్కృతి, వాస్తు శాస్త్రంలో ఏనుగును జ్ఞానం, శక్తి, శ్రేయస్సు, శుభానికి చిహ్నంగా భావిస్తారు. దేవాలయాలు, రాజభవనాల ప్రవేశ ద్వారాల వద్ద ఏనుగు విగ్రహాలు తరచుగా కనిపిస్తాయి. ఏనుగు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా సానుకూల శక్తిని కూడా ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే ప్రజలు తమ ఇళ్లలో లేదా కార్యాలయాలలో అలంకరణ, వాస్తు నివారణలుగా ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ప్రతి విగ్రహం మాదిరిగానే ఏనుగు విగ్రహాన్ని సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచడం అవసరం అంటున్నారు నిపుణులు. అప్పుడే దాని ప్రయోజనాలు పొందుతాయి.
ఏనుగు విగ్రహం ప్రాముఖ్యత:
భారతీయ సంప్రదాయంలో ఏనుగు జ్ఞానం, దీర్ఘాయువు, శ్రేయస్సుకు చిహ్నం. గణేశుడు స్వయంగా ఏనుగు ముఖం కలిగి ఉంటాడు. సిద్ధి, బుద్ధిలకు అధిపతి గణపతి.. కాబట్టి, ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచుకోవడం శుభప్రదం. అందుకే వాస్తు, ఫెంగ్ షుయ్ రెండింటిలోనూ ఏనుగు విగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది.
1. సంపద- శ్రేయస్సు పెరుగుదల- ఏనుగును శ్రేయస్సు, గొప్పతనానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఏనుగు బొమ్మ, విగ్రహం ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ విగ్రహం ఇంట్లో సంపద రాక, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందని విశ్వాసం.
2. కుటుంబంలో ఐక్యత, సామరస్యం- ఏనుగు స్వభావం ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా ఉంటుందని భావిస్తారు. ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల కుటుంబ కలహాలు తొలగిపోయి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది.
3. వృత్తి- విద్యలో పురోగతి- ఏనుగు జ్ఞానానికి చిహ్నం. దానిని పిల్లల రిడీంగ్ రూమ్ లేదంటే, పిల్లలు చదువుకునే ప్రదేశంలో ఉంచడం వల్ల వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఇది.. కెరీర్ పురోగతికి మార్గం సుగమం చేస్తుంది.
4. రక్షణ- బలానికి చిహ్నం- ఏనుగును బలం, భద్రతకు చిహ్నంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నిరోధించబడుతుంది. ఇంట్లో శాంతిని నిర్ధారిస్తుంది.
5. అదృష్టం- శుభ శక్తి ప్రవాహం- ఏనుగు విగ్రహం సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. ఇది ఇంటికి అదృష్టాన్ని తీసుకురావడమే కాకుండా, పర్యావరణాన్ని పవిత్రంగా, ఆనందంగా చేస్తుంది.
మీరు ఏ రకమైన ఏనుగు విగ్రహాన్ని ఎంచుకోవాలి?
లోహ విగ్రహం: ఇత్తడి లేదా వెండితో చేసిన ఏనుగు విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
చెక్క విగ్రహం: ఇది ఇంటి అలంకరణ, వాస్తు ఉపశమనం రెండింటికీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.
క్రిస్టల్ లేదా పాలరాయి విగ్రహం: ఇంటి అందం, ప్రశాంతతను కాపాడుకోవడానికి అనుకూలం.
జతగా ఉన్న ఏనుగులు: తలుపు వద్ద ఏనుగులను జంటగా ఉంచడం వల్ల సానుకూల శక్తి రెట్టింపు అవుతుంది.
ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచడానికి సరైన దిశ:
1. ఉత్తర దిశ: ఉత్తర దిశను వృత్తి, ఉపాధికి సంబంధించినదిగా భావిస్తారు. ఇక్కడ ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వలన వృత్తి వృద్ధి, వ్యాపారంలో పురోగతి లభిస్తుంది.
2. తూర్పు దిశ: తూర్పు దిశ జ్ఞానం, విద్యతో ముడిపడి ఉంది. ఇక్కడ ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల విద్యార్థులకు చదువులో విజయం, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
3. ప్రధాన ద్వారం: ఇల్లు లేదా కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఏనుగుల జతను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది దుష్ట శక్తుల నుండి ఇంటిని రక్షిస్తుంది. సానుకూల శక్తి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది.
4. లివింగ్ రూమ్: లివింగ్ రూమ్ లో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లోని సభ్యులందరిలో సామరస్యం, పరస్పర ప్రేమ పెరుగుతుంది.
5. నైరుతి మూల: ఈ మూల సంబంధాలు, స్థిరత్వానికి సంబంధించినది. ఇక్కడ ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల వైవాహిక జీవితంలో మాధుర్యం, స్థిరత్వం వస్తుంది.
ఏనుగు విగ్రహాన్ని ఉంచడానికి నియమాలు, జాగ్రత్తలు:
* విరిగిన విగ్రహాన్ని ఎప్పుడూ ఉంచుకోకండి. అది అశుభంగా పరిగణించబడుతుంది.
* విగ్రహాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, దుమ్ము లేకుండా ఉంచండి.
* తొండం పైకి లేపి ఉంచిన ఏనుగు విగ్రహం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
* ఇంట్లోని టాయిలెట్ లేదా బాత్రూమ్ దగ్గర విగ్రహాన్ని ఉంచవద్దు.
* ప్రార్థనా స్థలంలో లేదా ఆలయంలో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఫెంగ్ షుయ్ లో ఏనుగు నమ్మకం:
ఫెంగ్ షుయ్ లో ఏనుగును శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఏనుగును ఉంచుకోవడం వల్ల సంతోషకరమైన వైవాహిక జీవితం, పిల్లలకు ఆనందం లభిస్తుందని నమ్ముతారు. ఆఫీసులో డెస్క్ మీద చిన్న ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. కార్యాలయంలో విజయం లభిస్తుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








