Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. కార్తీకమాసంలో ప్రత్యేక రోజుల్లో స్పర్శ దర్శనాల రద్దు.. పూర్తి వివరాలు మీకోసం

| Edited By: Surya Kala

Oct 31, 2023 | 3:35 PM

కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో శని, ఆది, సోమవారాలలో భక్తులందరికి శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. అలానే రద్దీ రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన రద్దు చేసినట్లు వెల్లడించారు.

Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. కార్తీకమాసంలో ప్రత్యేక రోజుల్లో స్పర్శ దర్శనాల రద్దు.. పూర్తి వివరాలు మీకోసం
Mallanna Temple
Follow us on

హిందువులకు కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం.. శివకేశవులను ఆరాధించే ఈ పవిత్ర మాసంలో ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా శివాలయాలకు, శైవ క్షేత్రాల్లో శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరతారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శివ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలంలో నవంబరు 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తికమాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్తీక మాస ఏర్పాట్లకు సంబంధించి దేవస్థానం పరిపాలన భవనంలో దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ  సమావేశంలో ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ కార్తీక మాసంలో మల్లన్న ఆలయానికి వచ్చే  భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాలను ఆదేశించారు. ఆయా ఏర్పాట్లన్నీ కూడా ముందస్తుగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

కార్తీక మాసంలో శని, ఆది, సోమవారాలలో భక్తులందరికి శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. అలానే రద్దీ రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన రద్దు చేసినట్లు వెల్లడించారు. కార్తీకమాసంలో సాధారణలో రోజుల్లో కూడా సామూహిక, గర్భాలయ అభిషేకాలు పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో శివవిధిలో ఏర్పాటు చేయనున్నారు.  అలానే నవంబర్ 27వ తేదీ కార్తీక పౌర్ణమి.. అయితే 26 నే పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..