- Telugu News Photo Gallery Spiritual photos Kartik Masam Astro Tips: these Remedies For Peaceful And Harmonious Life in telugu
Karthika Masam: కార్తీక మాసంలో ఇంట్లో ఈ పరిహారాలు, పూజలు చేసి చూడండి.. సుఖ శాంతులు మీ సొంతం..
హిందూ క్యాలెండర్‌లోని 12 నెలలకు దేనికదే సొంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. హిందూ మతంలో కొన్ని నెలలు శుభకార్యాలకు పూజకు కూడా శుభప్రదంగా భావిస్తే, కొన్ని నెలలు పూజలకు మాత్రమే పరిమితం అని భావిస్తారు. హిందూ క్యాలెండర్ లోని ఎనిమిదవ నెల కార్తీక మాసం. ఈ నెల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఈ మాసం శివుడు, విష్ణువుకు చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న కొన్ని చర్యలు తీసుకుంటే జీవితంలో సంతోషం, ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం.
Updated on: Oct 31, 2023 | 4:16 PM

కార్తీక మాసంలో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు శాలిగ్రామం రూపంలో ఉన్న తులసి దేవిని వివాహం చేసుకున్నాడు. ఈ మాసంలో దీపదానం, యజ్ఞం, యాగం, గంగాస్నానం, దానధర్మాలు, వివాహాలు, గృహప్రవేశాలు వంటివి చాలా ఫలిస్తాయి. మీరు ఈ నెలలో గృహ శాంతి కోసం కొన్ని చర్యలు కూడా తీసుకోవచ్చు.

శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారైతే, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాసం అంతా తులసి మొక్కను పూజించవచ్చు. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించండి. తులసి చాలీసా చదవండి.

కార్తీక మాసంలో సాయంత్రం పూట మీ ఇంట్లోని పూజ చేసే చోట కర్పూరాన్ని వెలిగిస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంట్లోని సభ్యుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు వచ్చినా పరిష్కరించబడతాయి. అంతే కాదు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉదయం, సాయంత్రం పూజ చేస్తే మరింత ఫలప్రదం అవుతుంది.

కార్తీక మాసంలో అష్ట లక్ష్మిని పూజించండి దీనితో మీకు ఆర్థిక ప్రయోజనాలే కాకుండా సంతానం, ఆరోగ్యం, సంతోషం, శాంతి కూడా లభిస్తాయి. ప్రతి శుక్రవారం అష్టలక్ష్మిని పూజించాలి. కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు అష్టలక్ష్మి వ్రతం కూడా ఆచరించవచ్చు. అష్టలక్ష్మిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడవు.

ఇంట్లో సుఖ సంతోషాలు పెంపొందించడానికి కార్తీకమాసంలో ప్రతిరోజూ గంగాస్నానం చేయాలి. అయితే నది దగ్గరగా లేనివారు రోజూ స్నానం చేసే నీటిలో కొంత గంగాజలం కలుపుకోవచ్చు. ముందుగా నువ్వుల నూనెను శరీరానికి అప్లై చేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

కార్తీక మాసంలో ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. వాస్తవానికి ఈ మాసంలో ముల్లంగి తినడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆహారంలో ముల్లంగిని కూడా చేర్చుకోవచ్చు. అంతే కాకుండా కార్తీక మాసంలో పాల ఉత్పత్తులను ఎక్కువగా తినాలి. ఈ నెలలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, మద్యం మొదలైన వాటిని తినకూడదు.




