Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanipakam Temple: డబ్బు కట్టు.. ఎంత సేపైనా స్వామి వారి సేవలో ఉండు.. కాణిపాకం ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం..

Kanipakam Temple: కాణిపాకం ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంంది. రుసుము చెల్లించి.. రోజంతా స్వామి వారి సేవలో పాల్గొనవచ్చంటూ ప్రకటించింది.

Kanipakam Temple: డబ్బు కట్టు.. ఎంత సేపైనా స్వామి వారి సేవలో ఉండు.. కాణిపాకం ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 31, 2021 | 6:25 PM

Kanipakam Temple: కాణిపాకం ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంంది. రుసుము చెల్లించి.. రోజంతా స్వామి వారి సేవలో పాల్గొనవచ్చంటూ ప్రకటించింది. అవును మీరు విన్నది నిజమే. ‘డబ్బు కట్టు.. ఎంత సేపైనా స్వామి వారి సేవలో ఉండు..’ ఇప్పుడు ఇది కొత్త పాలసీ. దీనిపైనే చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 అంశాలతో కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల ఆలయంలోని ఉదయాస్తమాన సేవ తరహాలో కాణిపాకం ఆలయంలోనూ కొత్తగా సేవా టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది పాలకమండలి. సుప్రభాతం నుంచి ఏకాంతం వరకు అన్ని సేవల్లో పాల్గొనేలా లక్ష రూపాయల టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానం చేసింది. ఈ లక్ష రూపాయల టికెట్లు పొందిన దాతకు జీవితకాలమంతా ఏడాదికి ఒక రోజు ఆరుగురు కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించింది. అయితే.. ఇదే కాదు.. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. అందులో రోజంతా సేవ టికెట్‌ మాత్రం ఇదే తొలి సారి.

Also read:

Ariyana Glory New: అదరగొడుతున్న అరియానా అందాలు.. రెడ్ డ్రస్ లో మెరుపులు..(ఫొటోస్)

Payal Rajput: హాట్ లుక్స్ తో మతిపోగోతున్న ఆర్‌డి‌ఎక్స్ బ్యూటీ… పాయల్ ఎట్రాక్టీవ్ ఫొటోస్..

Dead Frog: ఓ ప్రముఖ చపాతీ పిండి ప్యాకెట్ నుంచి బయటపడిన చచ్చిపోయిన కప్ప.. కస్టమర్ షాక్..