
అన్ని అమావాస్యలలో జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజు పితృ తర్పణం, ఉపవాసం, దానధర్మాలు, ముఖ్యంగా చెట్ల పెంపకానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు మాత్రమే కాకుండా పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని శాస్త్రాలలో వివరించబడింది. జ్యేష్ఠ అమావాస్య రోజున ఏ అద్భుత మొక్కలను నాటాలో, వాటికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..
2025 జ్యేష్ఠ అమావాస్య ఎప్పుడు?
పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథి జూన్ 24న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిథి జూన్ 25న సాయంత్రం 4:02 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య తిథి జూన్ 25, 2025, బుధవారం రోజున జరుపుకుంటారు.
మీ విధిని మార్చే అద్భుత చెట్లు
హిందూ మత విశ్వాసం ప్రకారం జ్యేష్ఠ అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలు మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సును తీసుకురావడమే కాదు పూర్వీకుల ఆశీర్వాదాలను పొందడంలో కూడా సహాయపడతాయి.
రావి చెట్టు: రావి చెట్టును దైవిక వృక్షంగా భావిస్తారు. త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) అందులో నివసిస్తారని నమ్ముతారు. జ్యేష్ఠ అమావాస్య రోజున రావి చెట్టును నాటడం వల్ల పూర్వీకులకు శాంతి చేకూరుతుంది. కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. రావి చెట్టును నాటడం వల్ల వ్యక్తికి దీర్ఘాయుష్షు లభిస్తుందని, అతని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
మర్రి (వట) చెట్టు: హిందూ మతంలో కూడా మర్రి చెట్టు చాలా గౌరవించబడుతుంది. దీనిని ‘కల్పవృక్షం’ లాగా భావిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. మర్రి చెట్టును నాటడం వల్ల కుటుంబం పెరుగుతుంది. ఇంట్లో శాంతి, ఆనందం కొనసాగుతాయి. ఈ చెట్టు దీర్ఘాయువు, శ్రేయస్సుకు చిహ్నం. జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ చెట్టుని నాటడం వల్ల పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
వేప చెట్టు: వేప ఔషధ గుణాలతో నిండినదిగా పరిగణించబడుతుంది. అయితే ఈ చెట్టుకు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. వేప చెట్టుని శనీశ్వరుడికి, అంగారకుడికి సంబంధించినదని నమ్ముతారు. జ్యేష్ఠ అమావాస్య రోజున వేప చెట్టును నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుంది. ఇది పూర్వీకులను కూడా సంతోషపరుస్తుంది.
తులసి మొక్క: హిందూ మతంలో తులసిని చాలా పవిత్రంగా భావిస్తారు. దీనిని ‘మహాలక్ష్మి’ రూపంగా భావిస్తారు. తులసి మొక్కను ఏ రోజుననైనా నాటవచ్చు.. అయితే జ్యేష్ఠ అమావాస్య రోజున నాటడం చాలా ఫలవంతమైనది. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.
బిల్వ చెట్టు: బిల్వ చెట్టు శివుడికి చాలా ప్రియమైనది. జ్యేష్ఠ అమావాస్య రోజున బిల్వ చెట్టును నాటడం ద్వారా.. శివుడు సంతోషిస్తాడు. భోలాశంకరుడు ఆశీస్సులు లభిస్తాయి. ఈ చెట్టు ఇంట్లో సంపద, ధాన్యాలను పెంచుతుంది. అన్ని రకాల పాపాలను నాశనం చేస్తుంది.
జ్యేష్ఠ అమావాస్య ప్రాముఖ్యత
జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజును హలహరి అమావాస్య లేదా పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకుల శాంతి, వారి ఆశీర్వాదం కోసం శ్రాద్ధ కర్మలు ,తర్పణం నిర్వహిస్తారు. అలాగే చెట్ల పెంపకం కూడా చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే చెట్లు పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాదు సనాతన ధర్మం ప్రకారం ఆ చెట్లు దేవతలు, పూర్వీకులకు కూడా ప్రియమైనవి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.