
జన్మాష్టమి పండుగ శ్రీ కృష్ణుని భక్తి, ప్రేమ, లీలల వేడుక. శ్రీ కృష్ణుడి వేణువును ఆయన గుర్తింపు , ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగానే కాదు వాస్తు శాస్త్రంలో వేణువును చాలా శుభకరమైన, ప్రయోజనకరమైన వస్తువుగా భావిస్తారు. జన్మాష్టమి రోజున వేణువును ఇంటికి తీసుకువచ్చి సరైన స్థలంలో ఉంచితే..అది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాదు అదృష్టం , శ్రేయస్సు ద్వారాలను తెరుస్తుందని నమ్మకం. జన్మాష్టమి శుభ సందర్భంగా వేణువును ఉంచుకోవడం కేవలం ఆధ్యాత్మిక సంప్రదాయం మాత్రమే కాదు.. జీవితంలో ఆనందం, శాంతి , శ్రేయస్సు తీసుకురావడానికి ఇది సులభమైన మార్గం. ఈసారి జన్మాష్టమి నాడు వేణువును తీసుకు తెచ్చుకోండి.. శ్రీ కృష్ణుడి ఆశీస్సులతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు మీ సొంతం..
వేణువు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
శ్రీమద్ భాగవతం, పురాణాలలో శ్రీకృష్ణుని వేణువు మధురమైన రాగం గోపికల మనస్సులలో ప్రేమ, ఆనందం, భక్తిని మేల్కొలిపేదని ప్రస్తావించబడింది. ఈ మురళీ కేవలం సంగీతాన్ని మాత్రమే కాదు, సానుకూల శక్తిని ప్రసారం చేసేది. అందుకే ఇంట్లో వేణువును ఉంచుకోవడం శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందడంతో సమానమని భావిస్తారు.
ఎటువంటి వేణువు ఎక్కడ పెట్టుకోవాలంటే
పదార్థం: చెక్క లేదా ఇత్తడి వేణువు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
స్థానం: తూర్పు, ఈశాన్య లేదా పూజ గదిలో ఉంచండి.
విధానం: జన్మాష్టమి రోజున, వేణువును గంగా జలంతో శుభ్రం చేసి పసుపు లేదా ఎరుపు దారాన్ని కట్టి, శ్రీకృష్ణుని పాదాల వద్ద సమర్పించండి.
నియమం: వేణువును నేలపై ఉంచవద్దు.. ఎల్లప్పుడూ ఎత్తైన ప్రదేశంలో ఉంచండి.
వేణువు కృష్ణుడి ప్రేమకు సంబంధించిన పురాణ కథ
శ్రీకృష్ణుడు తన వేణువును వాయించినప్పుడల్లా బృందావనంలోని గోపికలు అన్నీ వదిలి ఆయన వైపు వచ్చేవారని చెబుతారు. ఆ వేణువు రాగం కేవలం సంగీతం కాదు, ఆత్మ , భగవంతుని కలయికకు పిలుపు. అందుకే వేణువును ప్రేమ, భక్తి , ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు.
వేణు గానంతో యమునా నది శుద్ధి
యమునా నదిలో నివసించిన కాళీయ నాగు తన విషపూరిత శ్వాసతో మొత్తం పర్యావరణాన్ని విషపూరితం చేశాడు. కాళీయుడిని జయించిన తర్వాత శ్రీ కృష్ణుడు తన వేణు గానం తో యమునా నీటిని శుద్ధి చేశాడట. వేణువు మాధుర్యంతో ప్రతికూలత కూడా సానుకూలంగా మారుతుందని దీని ద్వారా తెలుస్తుంది.
నెమలి ఈక, వేణువు కలయిక
శ్రీకృష్ణుని తలపై ఉన్న నెమలి ఈక , అతని చేతిలో ఉన్న వేణువు ఆయన దివ్య రూపానికి గుర్తింపు. నెమలి ఈక స్వచ్ఛత ,అదృష్టానికి చిహ్నం అని నమ్ముతారు. ఈ నెమలి ఈక వేణువుతో కలిసి ఉన్నప్పుడు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు అనేక రెట్లు పెరుగుతుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.