మానవులను కష్టాల నుంచి రక్షించడానికి అవతరించిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తారు. తిరుమల తిరుపతిని ఇలా వైకుంఠంగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్క రోజైనా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకోవాలని భావిస్తారు. అయితే ఎక్కువ రోజులు తిరుమల పర్యటనకు కేటాయించలేని భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది IRCTC. శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం రూ. 1000 లోపు ప్యాకేజీని భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఒక్క రోజు పర్యటనను భక్తుల కోసం ప్లాన్ ను ప్రకటించింది. ఈ యాత్రలో తిరుమల శ్రీవారిని మాత్రమే కాదు వెంకన్న భార్య పద్మావతి దేవి కొలువైన తిరుచానూరు- పద్మావతి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.
ఏ తేదీన అందుబాటులో ఉండనున్నదంటే
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు IRCTC టూర్ ను ఏప్రిల్ 15వ తేదీన అందుబాటులోకి తీసుకుని రానుంది.
దర్శన కోసం ప్రయాణం
IRCTC వెబ్‌సైట్ ప్రకారం “తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉదయం 08:00 గంటలకు భక్తులను పికప్ చేసుకుని తిరుమల కొండకు తీసుకుని వెళ్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం 13:00 గంటలకు చేయిస్తారు. అయితే ఈ దర్శన సమయం ఆ రోజు కొండపై ఉండే రద్దీని బట్టి ఆధారపడి ఉంటుంది. దర్శనం అనంతరం భక్తులు స్వామివారి అన్న ప్రసాదం తీసుకోవచ్చు.. లేదా సొంత ఖర్చుతో భోజనం చేయాల్సి ఉంటుంది. అనంతరం.. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం కోసం తిరుచానూరుకి తీసుకుని వెళ్లారు. అనంతరం తిరిగి ఆ రోజు సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌లో భక్తులను దిగబెడతారు.
ఈ ప్యాకేజీలో భాగంగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేయాలనుకుంటే.. IRCTC ఎగ్జిక్యూటివ్/TIFCని సంప్రదించండి. ప్యాకేజీ టారిఫ్ ను ఇప్పటికే నిర్ణయించారు. అయినప్పటికీ ఈ టూర్ ప్యాకేజీ ధరలో IRCTC/ప్రభుత్వం ప్రకారం మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ టూర్ లో శ్రీవారిని ఒక్కరోజులోనే దర్శించుకోవాలంటే మరిన్ని వివరాల కోసం అధికారిక IRCTC టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..