- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti because of these mistakes people even after hard work fail in life
Chanakya Niti: ఈ 4 విషయాలు మీ విజయానికి అడ్డకుంలు సృష్టిస్తాయంటున్న చాణక్య
చాణక్యుడు మనిషి నడవడిక, తీరు పట్ల అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ముఖ్యంగా వ్యక్తిలో బయటకు కనిపించేది ఒకటని.. లోపల ఆలోచనాతీరు ఒకటి చెప్పాడు.. అవును ఒకే వ్యక్తిలో రెండు రూపాలు ఉండే అవకాశం ఉంది. ఒకటి బయటి ప్రపంచం కోసం, మరొకటి వాస్తవంగా లోపల ఆలోచన అని చాణక్యుడు చెప్పాడు. ఇలా రెండు రకాలుగా ప్రవర్తించే వ్యక్తి తన జీవితంలో చాలా తప్పులు చేస్తాడు. అప్పుడు ఆ పనికి తగిన ఫలితం ఎప్పుడూ వెలువడదు. ఎంత కష్టపడినా విజయం దక్కదు.
Updated on: Apr 10, 2023 | 1:16 PM

ప్రతి వ్యక్తి జీవితంలో నిరంతర ఆనందం ఉండటం సాధ్యం కాదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఆచార్య చాణక్యుడు తన విధానాలలో అలాంటి కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా సరే తమ కష్టాలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు ఈ చాణక్య సూత్రాలను జీవితంలో విద్య సహా ఏ వివిధ అంశాలోనైనా వర్తింపజేస్తే.. ఎటువంటి సవాల్ ఎదురైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు.

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.

మూర్ఖులు: మూర్ఖులతో సహవాసం హానికరమని చాణక్యుడు వివరించాడు. వివేకం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. మూర్ఖులు తీసుకునే చెడు నిర్ణయాలు మీపై ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మీరు స్నేహం చేయండి.

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి చిహ్నం. కనుక వ్యక్తికీ నైపుణ్యం చాలా ముఖ్యం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ విజ్ఞత అవసరం. లేకపోతే, వారు సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. చాణక్యుడు ప్రకారం, మనిషి చెడు సమయాల్లో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే, అతను ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.






























