Dussera 2024: విజయదశమి నాడు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా..? దీని వెనుక కథేంటంటే..

|

Oct 11, 2024 | 5:29 PM

అందుకే అప్పటి నుంచి విజయదశమి నాడు జమ్మి చెట్టుని దేవీ ప్రతిరూపంగా కొలిచి పూజిస్తారు. జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటారు. పెద్దవాళ్ల ఆశ్వీరాదాలు తీసుకుంటారు.  అలయ్- బలయ్ పేరుతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

Dussera 2024: విజయదశమి నాడు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా..? దీని వెనుక కథేంటంటే..
Jammi Tree
Follow us on

సద్దుల బతుకమ్మ, దసరా అంటే..తెలంగాణదే జోరు అని చెప్పాలి. దసరా రోజున తెలంగాణ ప్రజలు తొలుత పాలపిట్టను చూస్తారు. పాలపిట్టను చూసేందుకు ప్రజలంతా కలిసి ఊరి బయటకు వెళతారు.. అనంతరం ఊరంతా ఒకచోట చేరి జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. గ్రామస్తులు, ఊరి పెద్దల సమక్షంలో గుమ్మడికాయనో, ఆనిగెపు కాయనో, గొర్రె పోతునో కొడతారు. జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దల చేతిలో పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అడవులలో ఉండే చెట్లను దైవంగా పూజించడం ఇక్కడ విశేషం. అయితే, విజ‌య ద‌శ‌మి రోజు జ‌మ్మి చెట్టునే ఎందుకు పూజిస్తారో తెలుసా..?

దేవీ నవరాత్రులు పదవ రోజు అనగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అని అంటారు. కనుక ఆ రోజు కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిదంటారు. అలానే ఆ రోజు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని పురాణాలు చెబుతున్నారు. అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, నగదు పెట్టెల్లో ఉంచుకోవటం వల్ల ధనవృద్ది జరుగుతుందని విశ్వాసం. అంతేకాదు.. జమ్మి చెట్టుకు పురాణాల్లో ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంది. అదేంటంటే..

క్షీరసాగర మధనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా పుట్టాయని చెబుతారు. వాటిల్లో జమ్మిచెట్టు కూడా ఒకటి. దీన్ని సంస్కృతంలో శమీ వృక్షంగా పిలుస్తారు. అలాగే, రామాయణం, మహాభారతాల్లో జమ్మి చెట్టుకు ప్రధాన్యత ఉంది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ బట్టల్ని, ఆయుధాల్ని జమ్మి చెట్టుపైన దాచి వెళ్లారని చెబుతారు. అవి ఇతరులకు ఏవో అస్తికలమాదిరిగా కనిపించేవని చెబుతారు. అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టుకి పూజలు చేసి ఆయుధాల్ని దించి కౌరవ సేనని తరిమికొట్టారని చెబుతారు.. అందుకే అప్పటి నుంచి విజయదశమి నాడు జమ్మి చెట్టుని దేవీ ప్రతిరూపంగా కొలిచి పూజిస్తారు. జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటారు. పెద్దవాళ్ల ఆశ్వీరాదాలు తీసుకుంటారు.  అలయ్- బలయ్ పేరుతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..