Vastu Tips: నీళ్ల పైపు విషయంలో ఈ మిస్టేక్స్ చేశారంటే.. మీ సంపాదన నీళ్లలా ఖర్చయిపోవడం ఖాయం…

ఇళ్లు కట్టాలంటే ప్రతిఒకరూ ముందుగా వాస్తు చూస్తారు. వాస్తు ప్రకారమే ఇళ్లు కడుతుంటారు. కానీ ఇంట్లో చిన్న చిన్న విషయాలను లెక్కలోకి తీసుకోరు.

Vastu Tips: నీళ్ల పైపు విషయంలో ఈ మిస్టేక్స్ చేశారంటే.. మీ సంపాదన నీళ్లలా ఖర్చయిపోవడం ఖాయం...
Tap
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 06, 2023 | 10:35 AM

ఇళ్లు కట్టాలంటే ప్రతిఒకరూ ముందుగా వాస్తు చూస్తారు. వాస్తు ప్రకారమే ఇళ్లు కడుతుంటారు. కానీ ఇంట్లో చిన్న చిన్న విషయాలను లెక్కలోకి తీసుకోరు. ఇంట్లో కూడా ప్రతీది వాస్తు ప్రకారం ఉంటేనే ఆ ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. లేకపోతే ఎంత సంపాదించినా బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. ఇంట్లో మనశ్శాంతి కరవవుతుంది. తరుచూ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అందుకే ఇళ్లు కట్టేటప్పుడు ఇంటి లోపలు కూడా ఖచ్చితంగా వాస్తు చూడాల్సిందేనని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో సానుకూల శక్తి ఉన్నప్పుడు…మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించి అనేక విషయాలను పేర్కొన్నారు.

ఉదాహరణకు మీ వంటగది ఏ దిశలో ఉండాలి? మీ గ్యాస్ స్టవ్ ను ఎక్కడ ఉంచాలి? ఇలాంటి విషయాన్నింటినీ వాస్తు శాస్త్రంలో క్షుణ్ణంగా పేర్కొన్నారు. అదే విధంగా ఇంట్లో నీటి కుళాయిలు ఏ దిశలో అమర్చాలో కూడా వాస్తు శాస్త్రం పేర్కొంది. వాస్తు శాస్త్రం ప్రకారం నీటి కుళాయిని దక్షిణ లేదా పడమర దిశలో ఏర్పాటు చేయకూడదు. బదులుగా ఉత్తరం, లేదా తూర్పు దిశల్లో మాత్రమే నీటికుళాయిని ఏర్పాటు చేయాలి. సింక్ ఉత్తరం లేదా ఈశాన్య వైపులో ఉండేలా చూసుకోవాలి. మీ ఇంట్లో సరైన దిశలో నీటి కుళాయిలను అమర్చనట్లయితే మీ సంపాదించినదంతా నీళ్లలా ఖర్చవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు నీళ్లకు డబ్బుకు దగ్గరి సంబంధం ఉంటుంది. నీటిని ఎంత ఖర్చు చేస్తే ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇంట్లో నీటికుళాయి ఏ దిశలో ఏర్పాటు చేయాలో తెలుసుకుందాం:

ఇవి కూడా చదవండి

ఇంట్లోని వంటగదిలో అగ్నిదేవుడు, అన్నపూర్ణదేవి నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వంటగదిలో అత్యంత ముఖ్యమైంది. వంటగదిలో సింక్ ను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్రం పేర్కొంది.

బోరింగ్ పంపులు ఉంచడానికి వాస్తు నియమాలు:

ఇంటికి ప్రధానగుమ్మం దగ్గర బోరింగ్ పంపులను ఎట్టిపరిస్థితిలోనూ ఉంచకూడదు. అలాగే బోరింగ్ వాష్ రూమ్ లేదా సెప్టిక్ ట్యాంక్ దగ్గర ఉంచితే అశుభంగా పరిగణిస్తారు. బోరింగ్ పంపును కుటుంబ సభ్యుల కదలికలు తక్కువగా ఉండే స్థలాన్ని ఎంచుకోని ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి.

– ఇంట్లో ట్యాపులు, పంపులు ఎట్టిపరిస్థితిలో లీకవకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ట్యాపులు, నీళ్ల పంపులు లీక్ అవుతుంటే మీరు సంపాదించినదంతా హరించుకుపోతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నల్లాలు లీకవుతుంటే వెంటనే వాటిని మార్చుకోండి.

-ఇంట్లో నీటికి సంబంధించిన పాత్రలు ఎప్పుడూ కూడా ఉత్తర దిశలోనే ఉంటాయి. ఎందుకంటే ఉత్తరదిశలో కుబేరుడు ఉంటాడు. కుబేరుడు సంపదకు సూచిక. అక్కడ పెట్టిన నీటి పాత్రలు లీక్ అవ్వకుండా చూడాలి.

Note: (వాస్తు వివరాలు, రాశిఫలాలు, ఇలాంటి ఆచార వ్యవహారాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ..