TTD: వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. మరో 3 రోజులు కొనసాగనున్న రద్దీ..

Tirumala Darshan: తిరుమలకు భక్త జనసంద్రం పోటెత్తింది. వరుస సెలవులతో తిరులమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయ పరిసరాలు, కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ మరో మూడురోజులు ఇలాగే కొనసాగే..

TTD: వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. మరో 3 రోజులు కొనసాగనున్న రద్దీ..
Tirumala Darshanam
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 15, 2022 | 9:12 AM

తిరుమలకు(Tirumala) భక్త జనసంద్రం పోటెత్తింది. వరుస సెలవులతో తిరులమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయ పరిసరాలు, కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ మరో మూడురోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారుల చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు క్యూలైన్లను తనిఖీ చేస్తున్నారు అదనపు ఈవో. దర్శనానికి 10 గంటల దర్శనం సమయం పడుతోంది. ఈ రద్దీ ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉంది. భక్తులు ఆళ్వార్‌ట్యాంక్‌ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వరకు వేచి ఉన్నారు. భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను టీటీడీ అందిస్తోంది. బ్రేక్‌ దర్శనాల రద్దుతో కరోనాకు ముందు పరిస్థితులు మళ్లీ రెండేళ్ల తరువాత తిరుమలలో కనిపిస్తున్నాయి. శ్రీవారిని నిన్న 88 వేల 748 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.11 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

అంతేకాదు టీటీడీ సామాన్య భక్తుల కోసం వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం (13-04-2022) నుంచి ఆదివారం (17-04-2022) వరకు బ్రేక్ దర్శనాలు నిలిపివేశారు. అలాగే సర్వ దర్శనం టికెట్ల సంఖ్యను రోజుకు 30 వేల నుంచి 45 వేలకు కూడా పెంచారు. భక్తులను టికెట్లు లేకపోయినా అనుమతిస్తుండటంతో ఈ రద్దీ ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉంది.

దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమలలో సాధారణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఆర్జిత సేవల కోసం భక్తుల్ని శ్రీవారి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అలాగే దర్శనం అనంతరం శఠారి, తీర్థం అందిస్తోంది.. పుష్కరణిలోకి భక్తుల్ని అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..

JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..