Ontimitta నేడే కోదండరాముడి కల్యాణం.. ఒంటిమిట్టకు సీఎం జగన్ రాక
కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట(Ontimitta) ఆలయంలో ఈరోజు సాయంత్రం శ్రీకోదండరామస్వామి కల్యాణ తంతు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్(CM Jagan) రెడ్డి హాజరవుతారు. ప్రభుత్వం తరఫున...
కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట(Ontimitta) ఆలయంలో ఈరోజు సాయంత్రం శ్రీకోదండరామస్వామి కల్యాణ తంతు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్(CM Jagan) రెడ్డి హాజరవుతారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాములవారికి సమర్పించనున్నారు. ఆరుగంటలకు ఒంటిమిట్ట చేరుకోనున్న సీఎం.. రాత్రి ఏడు గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే కల్యాణం కార్యక్రమంలో పాల్గొని.. రాత్రికి కడప(Kadapa) ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. శనివారం కడపలోని పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. పండు వెన్నెల్లో రాముల వారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ(TTD) ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి కల్యాణం కోసం వంద కిలోల ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేశారు. వాటిని ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందించనున్నారు. ముత్యాల తలంబ్రాలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి తెచ్చిన గోటితో ఒలిచిన తలంబ్రాలనూ స్వామివారికి సమర్పించనున్నారు.
ఒంటిమిట్ట రాములవారి కల్యాణం భిన్నమైన సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశి రాత్రి కల్యాణం నిర్వహిస్తారు. అయోధ్యాపురిలో జన్మించిన శ్రీరాముడు వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఒంటిమిట్ట ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు మూడూ ఒకే శిలలో చెక్కడం విశేషం.
Also Read
Rani Karnavati: చరిత్ర చెప్పని పాఠం ఈ యోధురాలు.. ముక్కులు కత్తిరించే రాణిగా ఖ్యాతి..