AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వీరికి స్థిరాస్తుల విషయంలో సమయస్పూర్తి అవసరం.. శుక్రవారం రాశి ఫలాలు..

ఈరోజు వీరు శుభకార్య ప్రయత్నాలు విజయవంతంగా చేస్తారు. శుభవార్తలు వింటారు. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు

Horoscope Today: వీరికి స్థిరాస్తుల విషయంలో సమయస్పూర్తి అవసరం.. శుక్రవారం రాశి ఫలాలు..
Rajitha Chanti
|

Updated on: Apr 15, 2022 | 7:03 AM

Share

మేష రాశి.. ఈరోజు వీరు శుభకార్య ప్రయత్నాలు విజయవంతంగా చేస్తారు. శుభవార్తలు వింటారు. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభ రాశి.. ఈరోజు వీరు దూర ప్రయణాలు ఎక్కువగా చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.

మిథున రాశి.. ఈరోజు వీరికి కుటుంబంలో విభేధాలు తొలగిపోతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ది ఉంటుంది.

కర్కాటక రాశి.. వీరికి కుటుంబంలో విభేధాలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల మద్ధతు ఆలస్యంగా లభిస్తుంది.

సింహ రాశి.. ఈరోజు వీరికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్పూర్తి అవసరం. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం చేసే పనులకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

కన్య రాశి.. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

తుల రాశి.. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. చెడు పనులకు దూరంగా ఉండాలి. మనోద్వేగానికి గురవుతారు. పిల్లల పట్ల కఠినంగా ఉండకూడదు. కొత్త పనులు ప్రారంభించకూడదు.. కోపంతో బంధుమిత్రులు దూరమయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి.. వీరి ఈరోజు వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడిపేస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. స్థిరనివాసం ఉంటుంది. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అనుకూల పరిస్థితులు ఉంటాయి.

మకర రాశి.. ఈరోజు మీడియా, కళకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో విభేధాలు తగ్గుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి.. ఈరోజు వీరు విందులు, వినోదాల్లో పాల్గోంటారు. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. ముఖ్యమైన సమాచారం అందుతుంది. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లోని వారు ఉత్సాహంగా ఉంటారు.

మీన రాశి.. ఈరోజు వీరికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ది ఆలస్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. స్థిర నిర్ణయాలు తీసుకోలేరు. సంఘంలో గౌరవ, మర్యాదలు తగ్గకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

Also Read: NTR: ఫిమేల్ లీడ్స్‌ పేవరెట్‌గా కొమురం భీముడు.. తారక్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్

K.G.F Chapter 2: రాకీభాయ్ స్టామినా.. అక్కడ భారీ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న కేజీఎఫ్ చాప్టర్-2..

Acharya: టాప్‌లో ట్రెండ్ అవుతున్న మెగాస్టార్ మూవీ ట్రైలర్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఆచార్య..

Mirnalini Ravi: మైమరపిస్తున్న ముద్దుగుమ్మ మృణలిని లేటెస్ట్ ఫొటోస్..