AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఢిల్లీలో గత 24గంటల్లో 50 శాతం పెరుగుదల.. స్కూల్‌లో టీచర్, స్టూడెంట్‌కు పాజిటివ్

Corona Virus: కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. రోజుకో కొత్త రూపం సంతరించుకుని ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. అయితే కోవిడ్ 19..

Corona Virus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఢిల్లీలో గత 24గంటల్లో 50 శాతం పెరుగుదల.. స్కూల్‌లో టీచర్, స్టూడెంట్‌కు పాజిటివ్
Surya Kala
|

Updated on: Apr 14, 2022 | 5:27 PM

Share

Corona Virus: కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. రోజుకో కొత్త రూపం సంతరించుకుని ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. అయితే కోవిడ్ 19 (Covid 19) నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు భారత దేశంలో వ్యాక్సినేషన్ (Corona Vaccine) వేగవంతం చేసింది. బూస్టర్ డోసుని ఇస్తోంది. దీంతో దేశంలో కరోనా వ్యక్తి అదుపులోకి వచ్చింది.. కొత్త కేసుల నమోదు కూడా గణనీయంగా తగ్గాయి వెయ్యి లోపు కేసులు నమోదు అవుతున్నాయి అనుకుని.. ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే గత 24 గంటల్లో మళ్ళీ వెయ్యికి దగ్గర్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వైరస్ కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 50 శాతం అధికంగా కేసులు నమోదయ్యి ఆందోళన రేకెత్తిస్తోంది.ముందురోజు అక్కడ 202 మందికి కరోనా సోకగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 299కి చేరింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది.

ఓ పాఠశాలలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ స్కూల్ లో ఒక టీచర్, విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.దీంతో వెంటనే అధికారులు చర్యలు ప్రారంభించారు. విద్యార్థులందరినీ ఇంటికి పంపివేశారు. ఇదే విషయంపై  ఆప్ ఎమ్మెల్యే అతిశి స్పందిస్తూ.. పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా స్కూల్ లో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ 23 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో స్కూల్ ను మూసివేశారు. ఘజియాబాద్‌లోని స్కూల్ లో కూడా  ఇద్దరు విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్కూల్ కు 3 రోజుల సెలవులు ప్రకటించారు.

మరోపక్క దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. గురువారం (ఏప్రిల్ 14,4.2022) కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో బుధవారం 4.34 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 1,007 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో గత రోజు కంటే ఏడు శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా ఒకే ఒక్క మరణం నమోదైంది. ఆ ఒక్కటి కూడా మహారాష్ట్రలో రికార్డయింది. 818 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.76 శాతం గా ఉందని వైద్య అధికారులు చెప్పారు. దేశం వ్యాప్తంగా ఇప్పటి వరకూ 186 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు దేశంలో ఎక్స్‌ఈ వేరియంట్ ప్రవేశించింది. అయితే ఈ వేరియంట్ ప్రభావం ఏ విధంగా ఉందనున్నదో తెలియాల్సి ఉంది

Also ReadHanuman Jayanti 2022: ఏప్రిల్ 16న హనుమాన్ జయంతినా విజయోత్సవమా.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు..

Telangana Congress: తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. త్వరలోనే రాహుల్ గాంధీ పర్యటన