Horoscope Today : రాశిఫలాల ఆధారంగా రోజును ప్రారంభించాలనుకుంటున్నారా.. ఏ ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండనుందంటే…
రాశిఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఈ పవిత్ర మాఘ ఆదివారం రోజున ఆ సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి.
రాశిఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఈ పవిత్ర మాఘ ఆదివారం రోజున ఆ సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. నేడు తిధి నవమి సాయంత్రం 4.గంటల 49నిమిషముల వరకు ఉంది. అలాగే నక్షత్రం మూల రాత్రి 9గంటలవరకు. అమృతఘడియలు ఈ రోజు మధ్యాహ్నం 2గంటల 47 నిమిషాలనుంచి సాయంత్రం 4.20 నిమిషాల వరకు, ఇక వర్జ్యం రాత్రి 7.27నిమిషాలనుంచి 9 గంటల వరకు తిరిగి తెల్లవారుజామున 6.29 నిమిషాలు ప్రారంభం అవుతుంది. మరి ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన కార్యక్రమాల్లో కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గౌరవ మర్యాదలు పొందే అవకాశం. ఈ రాశివారు ఈరోజు శ్రీరామ పట్టాభిషేక స్తోత్ర పారాయణం చేస్తే మేలు జరుగుతుంది.
వృషభ రాశి: వృషభ రాశి వారికి ఈరోజు వివాహం కానివారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ సంబంధిత విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మహాగణపతికి గరకను సమర్పించుకోవడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మిథున రాశి:
ఈ రాశివారికి గృహ మార్పులకు సంబంధించిన ఆలోచనలు కలుగుతుంటాయి. భూసంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరికొన్ని అంశాల్లో అనుకూలమైన విషయాలను సాధించుకుంటారు.శ్రీరామరక్ష స్తోత్రం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామీ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. క్రయ విక్రలలో తొందరపడకుండా ఉంటే మంచిది.అలాగే పెద్దవారి ఆరోగ్యం విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారికి మహాలక్ష్మి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
సింహ రాశి: సింహ రాశి వారు వ్యక్తిగత ఆరోగ్యవిషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దైవచింతన మేలుచేస్తుంది. శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం మేలు చేస్తుంది.
కన్య రాశి: ఈ రాశి వారు తలపెట్టిన కార్యాలు మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయివ్యక్తిగతంగా మిశ్రమంగా ఫలితాలు కనిపిస్తుంటాయి. మహాగణపతి దర్శనం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
తులా రాశి: ఈ రాశి వారికి పెద్దవారి ఆరోగ్యవిషయాలపట్ల జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు రాణించే అవకాశాలు ఉంటాయి. దుర్గ పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఈరోజుఉద్యోగాడి విషయాల్లో మార్పులు కనిపిస్తాయి. చర్మ సంబంధిత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం ఈ రాశి వారికి మేలు జరుగుతుంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు తగినట్టువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దైవ చింతన చేయడం ద్వారా సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో మీకు సహకరిస్తుంది. మహా లక్ష్మీ అమ్మవారి ఆరాధణ ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మకర రాశి: మకర రాశి వారు వ్యక్తిగత విషయాల కోసం అప్పులు చేస్త్తారు. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నారాయణ స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజుఅనుకోని బాధ్యతలు పెరుగుతుంటాయి. వ్యతిరేకతలు తగ్గిపోతుంటాయి. విశేష సుదర్శన నామస్మరణ మేలు చేస్తుంది.
మీన రాశి: మీన రాశి వారు ఈరోజు అన్నివిషయాలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దవారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది. హనిమన్ చాలీసా పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.